Kiran Abbavaram: రియాలిటీ సినిమాలో రఘుకుల తిలక సాంగ్.. కిరణ్ అబ్బవరం ఏమన్నారంటే..

రియాలిటీ సినిమాలో రఘుకుల తిలక పాట ఉండనుందనే రూమర్స్ కొన్నాళ్లుగా నెట్టింట తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ గురించి స్పందించిన కిరణ్ అబ్బవరం తనకి చాలా ఇష్టమని, ఆంజనేయ స్వామి భక్తుడిగా దాన్ని చేర్చినట్టు కిరణ్ అబ్బవరం తెలిపారు. రియాలిటీ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Kiran Abbavaram: రియాలిటీ సినిమాలో రఘుకుల తిలక సాంగ్.. కిరణ్ అబ్బవరం ఏమన్నారంటే..
Kiran Abbavaram

Updated on: Nov 13, 2026 | 8:53 AM

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం నటిస్తున్న సినిమా రియాలిటీ. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. అయితే మూవీ గురించి కొన్నాళ్లుగా అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో రఘుకుల తిలక అనే సాంగ్ ఉండనుందనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి భజ గోవిందం అనే పాటను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి రుత్తూ అనే మరో పాటను లాంచ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ మూవీలో రఘుకుల తిలక అనే సాంగ్ ఉండనుందనే ప్రచారం పై క్లారిటీ ఇచ్చారు. అలాగే తన తాజా చిత్రం రియాలిటీపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో రఘుకుల తిలక పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని, అది తన వ్యక్తిగత ఎంపిక అని పేర్కొన్నారు. తాను ఆంజనేయ స్వామికి వీరాభిమానినని, అందుకే తన తొలి దర్శకత్వ ప్రయత్నంలో ఈ ఆధ్యాత్మిక పాట ఉండాలని బలంగా కోరుకున్నానని కిరణ్ తెలిపారు. రఘుకుల తిలక పాటను ఎప్పుడూ వింటూ ఉంటానని, తన మనసులో దానికి ప్రత్యేక స్థానం ఉందని వివరించారు. ఈ పాటకు మరింత జీవం పోసేందుకు ఒరిజినల్ కంపోజర్‌లు, సింగర్‌లతోనే మళ్లీ పాడించామని, ఈ పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే రియాలిటీ చిత్రంలోని భజే గోవిందం పాట బాగా పాపులర్ అయ్యింది. ఈ పాట వెనుక ఉన్న రచయితకు అవకాశం ఎలా వచ్చిందో కిరణ్ పంచుకున్నారు. తాను నిర్మించిన తిమ్మరాజ్‌ పల్లి సినిమాకు ఆ యువకుడు రచయితగా పని చేశాడని, అతని రచనలు ఎంతగానో నచ్చాయని కిరణ్ గుర్తు చేసుకున్నారు. భజే గోవిందం ట్యూన్ బాగా కుదిరిన తర్వాత, కొత్త రచయితకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించానని, అతను తన జీవిత కష్టాలను, భావాలను పాటలో ఎలా పొందుపరుస్తాడో చూడాలని ప్రయత్నించామని చెప్పారు. బీమ్స్ అన్న కూడా ఈ ఆలోచనను ప్రోత్సహించారని, మొదటి వర్షన్‌లోనే ఆ రచయిత ప్రతిభకు తాము ఆశ్చర్యపోయి ఎంతో సంతోషించామని కిరణ్ తెలిపారు. ఈ పాట రియాలిటీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో వంద శాతం సహాయపడిందని ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రియాలిటీ చిత్ర నిర్మాతలు, సుధాకర్ , రాంబాబు, సినిమా విడుదల ప్రణాళికలు, కిరణ్‌తో వారి అనుభవాన్ని గురించి మాట్లాడారు. ఈ సినిమాను తొలుత దీపావళికి లేదా సంక్రాంతికి రావచ్చని అంచనా వేసినప్పటికీ, సినిమాను డిసెంబర్ 25, క్రిస్మస్ రోజున విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రానికి కిరణ్ అబ్బవరం దర్శకత్వం వహిస్తుండగా.. దేవిక భట్ హీరోయిన్ గా.. శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Loading...
Unable to load recommendations.
Follow Us