Viral video: కేజీఎఫ్(KGF) సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ యశ్ (YASH). ముఖ్యంగా కేజీఎఫ్2 సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాగా ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కించే పనిలో ఉన్న యశ్ దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులకే వెచ్చిస్తున్నాడు. వీలైనప్పుడల్లా భార్యపిల్లలతో కలిసి వెకేషన్లకు వెళుతున్నాడు. వారితో సరదాగా గడుపుతున్నాడు. అంతేకాదు తన ఫ్యామిలీతో గడిపిన హ్యాపీ మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నాడు. ఈక్రమంలో యశ్ సతీమణి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో బ్రష్ చేయడం గురించి యశ్ మందలించడంతో కాస్త నొచ్చుకుంటాడు కొడుకు యథర్వ్. తల్లి రాధికా పండిత్‌ని హత్తుకుని ‘డడ్డా (నాన్న) ఈజ్ ఏ బ్యాడ్ బాయ్’ అని చెబుతూ కనిపించాడు. దీంతో యశ్.. ‘డాడా (నాన్న) ఈజ్ ఏ గుడ్ బాయ్’ అనగా ‘నో.. నాన్న బ్యాడ్ బాయ్. అమ్మ గుడ్ గర్ల్’ అని సమాధానమిస్తాడు. ఇలా తండ్రీకొడుకుల మధ్య జరిగిన సరదా సంభాషణను రాధిక ఇన్‌స్టాలో షేర్ చేయగా అది కాస్తా వైరలవుతోంది.
కాగా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ యశ్-రాధిక 2016లో పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు కూతురు ఐరా కాగా మరొకరు కొడుకు యథర్వ్. కాగా యష్ తో పెళ్లైన తర్వాత రాధికా పండిత్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ గడుపుతోంది. అన్నట్లు సోషల్ మీడియాలో రాధికా ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. భర్త యశ్‌తో సమానంగా ఆమెకు ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫొటోలకు లక్షల్లో లైక్స్ వచ్చిపడుతుంటాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..