Yash Become Emotional On Fan Suicide: కేజీఎఫ్ హీరో యశ్ అభిమాని ఆత్మహత్య వ్యవహారం సంచలనం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ (25) అనే వ్యక్తి ఇటీవల ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు రామకృష్ణ రాసిన లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘తల్లికి మంచి కొడుకుగా, అన్నయ్యకు మంచి సోదరుడిగా మారలేకపోయాను. చివరికి తన ప్రేమను కూడా గెలవలేకపోయాను. ఇక జీవితంలో సాధించడానికి ఏమీ లేదు’ అంటూ రామకృష్ణ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ లేఖలో యశ్‌తో పాటు కర్ణాటక మాజీ సీఎం సిద్ద రామయ్యలు అంటే తనకు ఎంతో అభిమానమని రామకృష్ణ పేర్కొన్నాడు. దీంతో అభిమాని మరణించిన వార్త తెలుసుకున్న యశ్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘అభిమానుల అభిమానమే మాకు బలం, మాండ్యా రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిది. అయితే తాము అభిమానుల నుంచి ఆశించేది ఇది కాదని, ఈలలు, చప్పట్లు మాత్రమే తాము కోరుకుంటామని’ రాసుకొచ్చాడు. ఇక రామకృష్ణ అంత్యక్రియలకు సిద్ద రామయ్యలు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನವೇ ನಮ್ಮ ಬದುಕು.. ಜೀವನ.. ಹೆಮ್ಮೆ..
ಆದರೆ ಮಂಡ್ಯದ ರಾಮಕೃಷ್ಣನ ಅಭಿಮಾನಕ್ಕೆ ಹೆಮ್ಮೆಪಡಲು ಸಾಧ್ಯವೇ…
ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನಕ್ಕೆ ಇದು ಮಾದರಿಯಾಗದಿರಲಿ.. ಕೋಡಿ ದೊಡ್ಡಿ ರಾಮಕೃಷ್ಣನ ಆತ್ಮಕ್ಕೆ ಚಿರಶಾಂತಿ ಸಿಗಲಿ…
ಓಂ ಶಾಂತಿ…— Yash (@TheNameIsYash) February 18, 2021
ಮಂಡ್ಯ ತಾಲೂಕಿನ ಕೋಡಿದೊಡ್ಡಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಆತ್ನಹತ್ಯೆಗೆ ಶರಣಾದ ಕೃಷ್ಣ ಎಂಬ ಯುವಕನ ಅಂತ್ಯಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದೆ.
ಆತ್ಮಹತ್ಯೆಗೂ ಮುನ್ನ ಹುಡುಗ ತನ್ನ ಅಂತ್ಯಕ್ರಿಯೆಗೆ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಬರಬೇಕು ಅಂತ ಬರೆದಿಟ್ಟಿದ್ದ, ಆ ಕಾರಣ ಅತ್ಯಂತ ದುಃಖದಿಂದ ಆತನ ಕೊನೆ ಆಸೆ ಈಡೇರಿಸಿದ್ದೇನೆ. 1/5 pic.twitter.com/5CkznIfy27— Siddaramaiah (@siddaramaiah) February 18, 2021