Pushpa 2 The Rule: పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్.. అద్దిరిపోయే న్యూస్ చెప్పిన చిత్రయూనిట్

ఈ సినిమాలో బన్నీ మాస్ యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరక్కేక్కిన ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. ఇక పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే..ఇటీవలే సెకండ్ పార్ట్ ను మొదలు పెట్టారు సుకుమార్.

Pushpa 2 The Rule: పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్.. అద్దిరిపోయే న్యూస్ చెప్పిన చిత్రయూనిట్
Pushpa 2 Allu Arjun

Updated on: May 19, 2023 | 6:56 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ను పదింతలు పెంచిన సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా  నిలవడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఇక ఈ సినిమాలో బన్నీ మాస్ యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరక్కేక్కిన ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. ఇక పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే..ఇటీవలే సెకండ్ పార్ట్ ను మొదలు పెట్టారు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్ప్స్.. అల్లు అర్జున్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప సినిమా లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే.. పోలీస్ పాత్రలో ఆయన కనిపించి మెప్పించాడు. మొదటి పార్ట్ లో ఆయన కనిపించే సన్నివేశాలు తక్కువే అని చెప్పాలి.. సెకండ్ పార్ట్ లో ఫహద్ కు బన్నీ కి మధ్య సీన్స్ అదిరిపోతాయని తెలుస్తోంది.

తాజాగా పుష్ప 2 లో ఫహద్ ఫాజిల్ షూటింగ్ పార్ట్ ను కాంప్లీట్ చేశారు డైరెక్టర్ సుకుమార్. ఈ మేరకు ఓ ట్వీట్  చేశారు. షూటింగ్‌ లొకేషన్‌లో డైరెక్టర్ సుకుమార్, ఫహాద్‌ మానిటర్‌ స్క్రీన్‌ను చూస్తున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడు’ అని రాసుకొచ్చారు. భన్వర్‌సింగ్‌ షెకావత్‌ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా పార్టీలేదా పుష్ప అనే డైలాగ్ విపరీతంగా వైరల్ అయ్యింది.