కరోనా నేపథ్యంలో ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో.. నిర్మాతలు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లవైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు ఆన్‌లైన్‌లో రిలీజ్ అయ్యాయి. మరికొన్ని చిత్రాలు లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో మహానటి కీర్తి సురేష్ నటించిన మరో చిత్రం ఆన్‌లైన్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. కొత్త దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో కీర్తి నటించిన మిస్ ఇండియా చిత్రం ఆన్‌లైన్‌లో విడుదల అయ్యేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి ఈ చిత్ర నిర్మాత మహేష్ కోనేరు ఓ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా లాక్‌డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకోగా.. ఇందులో కీర్తి పలు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే కీర్తి నటించిన పెంగ్విన్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదల అయ్యింది. ఇందులో కీర్తి నటనకు మంచి మార్కులే పడ్డా.. మూవీకి మాత్రం మిక్స్‌డ్ రివ్యూలు వినిపించాయి.