మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీ తొలిదశ షూటింగ్ పూర్తి.. సెకండ్ షెడ్యూల్ కోసం బయలుదేరిన మహానటి..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇందులో మహేష్‏కు కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుంది.

మహేష్ సర్కారు వారి పాట మూవీ తొలిదశ షూటింగ్ పూర్తి.. సెకండ్ షెడ్యూల్ కోసం బయలుదేరిన మహానటి..

Updated on: Feb 15, 2021 | 9:25 PM

Actress Keerthi Suresh : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో.. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేష్‏కు కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ దుబాయ్‏లో శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ రేపు ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‏లో పాల్గొనేందుకు కీర్తి.. తన ట్రావెల్ బ్యాగ్‏తో సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోను కీర్తి తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది.

ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగంలో జరిగే భారీ కుంభకోణాలు చుట్టూ జరుగుతుంది. ఇందులో ప్రకాశ్ రాజ్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కానీ ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు చిత్రయూనిట్. మహేష్, పరశురాం కాంబోలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‏బీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నాయి.

Also Read:

మలేరియాతో ఇబ్బంది పడుతున్నా షూటింగ్ మిస్ చేయలేదు.. గత సంవత్సర అనుభవాలను చెబుతున్న అందాల తార..

 

Follow Us