KBC-Junior winner: కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెల్చుకున్న ఎనిమిదో తరగతి అమ్మాయి

|

Dec 27, 2022 | 5:41 PM

కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్స్‌లో పంజాబ్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఏకంగా రూ.50 లక్షలు గెల్చుకుంది. షో చూడటం మాత్రమేకాదు ఎప్పటికైనా కేబీసీలో పాల్గొనాలని కలలుకన్న ఈ అమ్మాయి అనతికాలంలోనే తన కలను నెరవేర్చుకుంది. వివరాల్లకెళ్తే..

KBC-Junior winner: కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెల్చుకున్న ఎనిమిదో తరగతి అమ్మాయి
KBC-Junior winner Japsimran Kaur
Follow us on

కౌన్ బనేగా కరోడ్‌పతి జూనియర్స్‌లో పంజాబ్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఏకంగా రూ.50 లక్షలు గెల్చుకుంది. షో చూడటం మాత్రమేకాదు ఎప్పటికైనా కేబీసీలో పాల్గొనాలని కలలుకన్న ఈ అమ్మాయి అనతికాలంలోనే తన కలను నెరవేర్చుకుంది. వివరాల్లకెళ్తే.. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన జప్‌సిమ్రన్‌ కేంద్రీయ విద్యాలయలో ఎనిమిదో తరగతి చదువుతోంది. జనరల్ నాలెడ్జ్‌లో అభీష్టం ఉండటం వల్ల కౌన్ బనేగా కరోడ్‌పతిలో పాల్గొనాలని ఉవ్విళ్లూరింది. అంతటితో ఆగకుండా అందుకు దారులు ఏర్పరచుకుంది. తండ్రి సహాయంతో ఎట్టకేలకు కేబీసీలో పాల్గొనేందుకు అవకాశం దక్కించుకుంది.

ఐతే నేరుగా ఈ కార్యక్రమానికి వెళ్లలేదట.. తొలుత రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూలో సత్తా చాటిమరీ కేబీసీలో పాల్గొంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని రెండో రౌండ్‌లో ఇంటర్వ్యూకి హాజరైనట్లు జప్‌సిమ్రన్‌ తెల్పింది. షో వ్యాఖ్యాత అమితాబ్ బచ్చన్‌ను కలవడం, 50 లక్షలను గెలవడం గురించి జప్‌సిమ్రన్ మీడియాతో మాట్లాడుతూ..

‘హాట్‌ సీట్‌లో కూర్చు్న్న తర్వాత ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అని భయపడ్డాను. కానీ అమితాబ్ బచ్చన్‌ సర్ పిల్లలతో చక్కగా మాట్లాడతారు. ఆయనతో మాట్లాడుతుంటే ఆందోళన దానంతట అదే తగ్గిపోతుంది. ఈ ప్రోగ్రాంలో నేను 50 లక్షలు గెల్చుకోవడం చాలా ఆనందంగా ఉందని’ జప్‌సిమ్రన్‌ పేర్కొంది. తన కూతురు సాధించిన విజయాన్ని చూస్తే గర్వంగా అనిపిస్తోందని, మా కుటుంబానికి మాత్రమేకాకుండా, సిటీకి, రాష్ట్రానికి కూడా తను మంచి పేరు తీసుకొచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన కూతురు తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆమె తల్లి గుర్విందర్ కౌర్ అన్నారు. జప్‌సిమ్రన్‌ 10 నెలల వయస్సులోనే మాట్లాడటం మొదలుపెట్టిందని ఆమె తెలిపారు. స్పేస్ సైంటిస్టు అవ్వాలనుకుంటున్న జప్‌సిమ్రన్‌కు మొదటి నుంచి పుస్తకాలు చదవడమంటే అమితాశక్తి అని గుర్విందర్ కౌర్ చెప్పుకొచ్చారు. ఇంత డబ్బు గెల్చుకున్నావ్‌ కదా.. ఈ డబ్బుతో ఏం చేస్తావనే ప్రశ్నకు సమాధానంగా.. మా నాన్నమ్మ మోకాళ్ల ఆపరేషన్‌కు సాయం చేస్తానని, స్పేస్ సైంటిస్ట్ అయిన తర్వాత, పేద పిల్లల చదువుకు సాయం చేస్తానని జప్‌సిమ్రన్‌ తెల్పింది. కాగా కౌన్ బనేగా కరోడ్‌పతి నిబంధనల ప్రకారం జప్‌సిమ్రన్‌కు 18 ఏళ్ల వయసు వచ్చాక 50 లక్షల రూపాయలు అందజేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.