OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కార్తీ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలు లేదా ఐదు వారాల తర్వాతనే ఓటీటీల్లో వస్తుంటాయి సినిమాలు. అయితే ఈ మధ్యన కొన్ని సినిమాలు మరీ మూడు వారాలకు లేదా అంతకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఈ జాబితాలో కార్తీ నటించిన లేటెస్ట్ స్పైయాక్షన్ థ్రిల్లర్ మూవీ కూడా చేరింది.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కార్తీ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Sardar 2 Movie

Updated on: Sep 28, 2026 | 5:46 PM

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అతను నటించిన సినిమాలు తమిళంతో పాటు ఏకకాలంలో తెలుగులోనూ రిలీజవుతుంటాయి. అలా కార్తీ నటించిన లేటెస్ట్ స్పైయాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2. సుమారు నాలుగేళ్ల క్రితం (2022)లో రిలీజై సంచలన విజయం సాధించిన సర్దార్ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ 2 తెరకెక్కింది. మొదటి భాగాన్నే తెరకెక్కించిన దర్శకుడు పీఎస్ మిత్రనే సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించాడు. కార్తీతో పాటు విలక్షణ నటుడు ఎస్జే సూర్య విలన్ గా నటించడం, ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ వంటి స్టార్ హీరోయిన్స్ నటించడంతో సర్దార్ 2 సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే రిలీజ్ కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, ట్రైలర్ మూవీపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. అయితే తీరా థియేటర్లలోకి అడుగు పెట్టాక సర్దార్ 2 అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సర్దార్ 2 కు నెగెటివ్ టాక్ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. అయితే ఉన్నంతలో డబుల్ రోల్ లో కార్తీ నటన, ఎస్జే సూర్య విలనిజం అభిమానులను మెప్పించాయి. థియేటర్లలో పెద్దగా ఆడని సర్దార్ 2 సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

సర్దార్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ గురువారం(అక్టోబరు 01) నుంచి కార్తీ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి సర్దార్ 2 సినిమా అందుబాటులోకి రానుంది. కాగా థియేటర్లలోకి వచ్చిన 20 రోజులకే కార్తీ సినిమా ఓటీటీలోకి రానుండడం గమనార్హం.

అమెజాన్ ప్రైమ్ లో సర్దార్ 2..

ప్రిన్స్ పిక్చర్స్, ఐవీవై ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై ఎస్.లక్ష్మణ్ కుమార్ సర్దార్ 2 సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు యోగిబాబు, రజీషా విజయన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సామ్ సీఎస్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. మరి థియేటర్లలో పెద్దగా ఆడని సర్దార్ 2 ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

సర్దార్ 2 సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us