Balakrishna: క్షమాపణలు చెప్పాల్సిందే.. బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టీమేటం..

|

Jan 24, 2023 | 9:15 PM

వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనే కాకుండా, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావుపై బాలయ్య..

Balakrishna: క్షమాపణలు చెప్పాల్సిందే.. బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టీమేటం..
Balakrishna
Follow us on

వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనే కాకుండా, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావుపై బాలయ్య చేసిన కామెంట్స్ మరో టర్న్ తీసుకున్నాయి. అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వారసులు, అభిమానులు సీరియస్‌గా రియాక్ట్ అవ్వగా.. ఎస్వీ రంగారావుపై చేసిన కామెంట్స్‌పై కాపు నేతలు తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణకు, టీడీపీకి కాపునాడు అల్టీమేటం ఇచ్చింది. ఎస్వీ రంగారావును ఉద్దేశించి ఆ రంగారావు, ఈ రంగారావు అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది కాపునాడు. బాలయ్య వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఈ నెల 25వ తేదీ లోపు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది.

అక్కినేని అభిమానుల ఆగ్రహం..

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ అగ్గిరాజేశాయి. అభిమాన సంఘాల మధ్య నిప్పుపెట్టాయి. వివాదం రోజు రోజుకు ముదురుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది అక్కినేని ఫ్యాన్స్‌ అసోసియేషన్. మా ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మండిపడింది. అక్కినేని, తొక్కినేని అంటూ బాలకృష్ణ అసభ్య పదజాలంతో మాట్లాడటం అహంకార పూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తోందని ప్రకటించింది.

అక్కినేని తన నటనతో, సేవాభావంతో ఎంతో మంది ఆర్టిస్ట్‌లకు అవకాశాలు కల్పించారు. నటన రంగంలో ఆయన ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారులు మద్రాసులోనే అంతం అవకుండా హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో సేవలు చేశారు. నాగేశ్వర్‌రావును కించపరిచేలా కామెంట్ చేసిన బాలకృష్ణ వెంటనే క్షమాపణ చేపట్టాలంటూ అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వారసుల రియాక్షన్..

బాలకృష్ణ అక్కినేనిపై చేసిన కామెంట్లపై నాగచైతన్య, అఖిల్ రియాక్టయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు, అలాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే అన్నారు అక్కినేని సోదరులు.

వరుస కామెంట్స్..

ఇటీవల బాలకృష్ణ నోటి నుంచి వరుస కాంట్రవర్సియల్ కామెంట్స్ రిలీజయ్యాయి. దేవాంగులకూ రావణబ్రహ్మకూ సంబంధముందంటూ వ్వాఖ్యానించారు బాలకృష్ణ. దీనిపై దేవబ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వెంటనే రియాక్టైన బాలకృష్ణ పొరబాటున దొర్లిన తప్పుగా చెప్పుకొస్తూ నోట్ రిలీజ్ చేశారు. దేవాంగుల్లో తనకు చాలా మంది అభిమానులుంటారు, వారిని తానెందుకు బాధ పెడతానంటూ పశ్చాతాపంతో కూడిన ప్రకటన చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..