Kapatadhaari Trailer : ఆకట్టుకుంటున్న ‘కాపధారి’ ట్రైలర్.. క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌తో రాబోతున్న సుమంత్

సుమంత్ హీరోగా వస్తున్న సినిమా కపటదారి. ఈ చిత్రాన్ని ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తుండగా, క్రియేటివ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ధనంజయన్ నిర్మిస్తున్నారు.

Kapatadhaari Trailer : ఆకట్టుకుంటున్న కాపధారి ట్రైలర్.. క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌తో రాబోతున్న సుమంత్

Updated on: Jan 12, 2021 | 8:39 PM

Kapatadhaari Trailer : సుమంత్ హీరోగా వస్తున్న సినిమా కపటదారి. ఈ చిత్రాన్ని ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తుండగా, క్రియేటివ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ధనంజయన్ నిర్మిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కావ‌లుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కన్నడలో ఈ చిత్రాన్ని పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. కన్నడలో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌ను అక్కినేని నాగచైతన్య, సమంత విడుదల చేశారు. సుమంత్‌, నందిత జంటగా నటిస్తుండగా.. పూజాకుమార్‌, నాజర్‌, జయప్రకాశ్‌, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘కపటధారి’ టీజర్ విశేషంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది.