Kichcha Sudeep: టాలీవుడ్‌ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పిన కన్నడ సూపర్‌ స్టార్‌.. కారణమేంటంటే

|

Jul 21, 2022 | 1:37 PM

Vikrant Rona: ఈగ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించాడు కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep). ఆతర్వాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించి తెలుగువారికి మరింత చేరువయ్యాడు. బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను

Kichcha Sudeep: టాలీవుడ్‌ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పిన కన్నడ సూపర్‌ స్టార్‌.. కారణమేంటంటే
Kichcha Sudeep
Follow us on

Vikrant Rona: ఈగ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించాడు కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep). ఆతర్వాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించి తెలుగువారికి మరింత చేరువయ్యాడు. బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించాడు. ఇప్పుడు తొలిసారిగా పాన్‌ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నాడు. అదే సోషియా ఫాంటసీ అడ్వెంచెరస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన విక్రాంత్‌రోణ (Vikrant Rona). బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez ) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ఈ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేశారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజిబిజీగా ఉంటోంది చిత్రబృందం.

త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటా..

ఇవి కూడా చదవండి

కాగా ప్రమోషన్లలో భాగంగా గురువారం (జులై 21) హైదరాబాద్‌, చెన్నై, కొచ్చిన్‌ తదితర నగరాల్లో విక్రాంత్‌ రోణ చిత్రబృందం ప్రెస్‌మీట్లు నిర్వహించాల్సి ఉంది. హీరో సుదీప్‌ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఉన్నట్లుండి సుదీప్‌ అస్వస్థతకు గురికావడంతో ప్రెస్‌మీట్లను రద్దు చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా టాలీవుడ్‌, కోలీవుడ్‌ మీడియాకు క్షమాపణలు చెప్పారు సుదీప్‌. ‘అనారోగ్యం కారణంగా ప్రయాణాలు చేయలేకపోతున్నా. దీనివల్ల హైదరాబాద్‌, చెన్నై, కొచ్చిన్‌లో ఈరోజు జరగాల్సిన ప్రెస్‌మీట్స్‌ అన్నింటినీ రద్దు చేస్తున్నా. మీడియా మిత్రులందరికీ క్షమాపణలు చెబుతున్నా. కోలుకొన్న వెంటనే ప్రెస్‌మీట్స్‌లో మళ్లీ పాల్గొంటా. త్వరలోనే మీ అందర్నీ కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ గురువారం ఉదయం ట్విట్టర్‌లో రాసుకొచ్చారు సుదీప్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..