సంజయ్‌ దత్‌ని కలిసిన కంగనా రనౌత్‌.. ఖల్‌ నాయక్‌ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారన్న నటి

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌, ఖల్‌నాయక్‌ సంజయ్‌ దత్‌ని కలిశారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

సంజయ్‌ దత్‌ని కలిసిన కంగనా రనౌత్‌.. ఖల్‌ నాయక్‌ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారన్న నటి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 27, 2020 | 1:42 PM

Kangana Sanjay Dutt: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌, ఖల్‌నాయక్‌ సంజయ్‌ దత్‌ని కలిశారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. సంజయ్‌ సర్‌, నేను ఒకే హోటల్‌లో ఉన్నామని తెలిసిన తరువాత ఆయనను కలిసేందుకు ఈ ఉదయం వెళ్లాను. ఆయన చాలా అందంగా, ఆరోగ్యంగా ఉండటం నాకు సంతోషాన్ని ఇచ్చింది. మీరు జీవితాంతం సంతోషంగా ఆరోగ్యంతో ఉండాలని మేము ప్రార్థించాము అని కంగనా తన సోషల్ మీడియాలో కామెంట్‌ పెట్టారు. ఈ సందర్భంగా సంజుతో తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఇక ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే బాలీవుడ్‌పై ఎప్పుడూ విమర్శలు చేసే కంగనా.. సంజయ్‌ని కలవడం విశేషం. (Official: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ.. ఇక్కడ పరిచయం చేసిన వినాయక్‌నే అక్కడ కూడా)

కాగా తాను స్టేజ్‌ 4 ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన ఆ మధ్యన వెల్లడించారు. దీంతో అభిమానులందరూ షాక్‌కి గురయ్యారు. ఆ తరువాత విదేశాలకు వెళ్లిన సంజయ్‌.. పూర్తిగా కోలుకొని భారత్‌కి వచ్చారు. ఇక ప్రస్తుతం ఈ నటుడు.. యశ్‌ హీరోగా నటిస్తోన్న కేజీఎఫ్‌ 2లో అధీర అనే విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు కంగనా రనౌత్‌.. జయలలిత బయోపిక్‌ తలైవిలో నటిస్తున్నారు. (బాలీవుడ్‌లో రీమేక్ అవ్వబోతున్న ఊసరవెల్లి.. ప్రకటించిన ప్రముఖ నిర్మాత.. ఎన్టీఆర్ పాత్రలో అక్షయ్‌..!)