Kamal Haasan Discharged : కమల్ కాలుకు శ‌స్త్ర‌చికిత్స.. హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన లోకనాయకుడు

కమల్‌ హాసన్‌ కాలికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. నాలుగైదు రోజులు హాస్పిటల్‌లోనే ఉంటారని, తర్వాతే డాక్టర్స్‌ ఆయన్ని డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు కమల్ కూతుర్లు

Kamal Haasan Discharged : కమల్ కాలుకు శ‌స్త్ర‌చికిత్స.. హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన లోకనాయకుడు

Updated on: Jan 23, 2021 | 5:42 AM

Kamal Haasan Discharged : కమల్‌ హాసన్‌ కాలికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. నాలుగైదు రోజులు హాస్పిటల్‌లోనే ఉంటారని, తర్వాతే డాక్టర్స్‌ ఆయన్ని డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు కమల్ కూతుర్లు శ్రుతిహాసన్, అక్షరహాసన్ తెలిపిన విషయం కూడా విదితమే. కమల్‌ కాలి ఆపరేషన్‌ను చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో నిర్వహించారు. కాగా ఆయన హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ సంద‌ర్భంగా ఆస్ప‌త్రి సిబ్బందితో క‌లిసి ఫొటోలు దిగారు. కమల్ స్పందిస్తూ… కొన్ని సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన ఓ ప్ర‌మాదం కార‌ణంగా నా కాలుకు శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాన‌ని తెలిపారు. శ‌స్త్ర‌చికిత్స‌లో భాగంగా ఫాలో అప్ స‌ర్జ‌రీ చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. కొంత కాలం డాక్ట‌ర్లు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారని సోష‌ల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలిపారు కమల్ హాసన్. ఇక డిశ్చార్ ఫోటోలను షేర్ చేసిన రమేష్ బాల “క‌మ‌ల్‌హాస‌న్ కాలుకు విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ పూర్త‌యింది. ఇవాళ డిశ్చార్జ‌య్యారు. కొన్ని రోజులు విశ్రాంతి అవ‌స‌రమ‌ని వైద్యులు చెప్పార‌ని తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Regina Cassandra : నా సొంత నిర్ణయాలతోనే ముందుకుసాగుతా.. సినీ జర్నీ పై హీరోయిన్ రెజీనా..