Cannes Debut: 945 డైమండ్స్, బ్లూ సఫైర్ నెక్లెస్‌తో మైండ్‌ బ్లోయింగ్ లుక్‌లో టాలీవుడ్ బ్యూటీ

సౌత్ ఇండియన్ సినిమా కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే మన సినిమాలు, దర్శకులు గ్లోబల్ వేదికలపై సత్తా చాటుతుండగా, తాజాగా టాలీవుడ్, మోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ఒక స్టార్ కిడ్ ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందచందాలతో, అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో అంతర్జాతీయ మీడియాను సైతం ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

Cannes Debut: 945 డైమండ్స్, బ్లూ సఫైర్ నెక్లెస్‌తో మైండ్‌ బ్లోయింగ్ లుక్‌లో టాలీవుడ్ బ్యూటీ
Kalyani Priyadarshan At Cannes Debut

Updated on: May 17, 2026 | 6:04 PM

మలయాళం, తమిళంతో పాటు తెలుగులో పలు వైవిధ్యమైన సినిమాల్లో నటించి మెప్పించిన హోమ్లీ బ్యూటీ కల్యాణీ ప్రియదర్శన్​, కాన్స్ వేదికపై అడుగుపెట్టడం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ వేడుకలో ఆమె ధరించిన బ్లాక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అవుట్‌ఫిట్ మాత్రమే కాదు, ఆమె అలంకరించుకున్న నగల వైభవం కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

రెడ్ కార్పెట్‌పై రాయల్ లుక్..

రెడ్ కార్పెట్ మీద కెమెరా కళ్లన్నీ ఆమె ధరించిన నగల వైపే తిరిగాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన నెక్లెస్ ఈమె లుక్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ నెక్లెస్ వెనుక భాగంలో ఒక శిల్పం లాంటి చైన్ పొడిగింపుతో ఉండి, ఆమె అవుట్‌ఫిట్‌కు మరింత రాయల్ లుక్‌ను తెచ్చింది.

ఈ అద్భుతమైన నెక్లెస్‌ను 14 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేశారు. ఇందులో 52 క్యారెట్ల పియర్ షేప్డ్ (అరటి పండు గింజ ఆకారం) బ్లూ శాఫైర్ (నీలమణి)ని అమర్చారు. అంతేకాదు, ఈ నెక్లెస్‌లో మొత్తం 945 నేచురల్, బ్రిలియంట్ మరియు ప్రిన్సెస్ కట్ డైమండ్స్ ఉపయోగించారు. వీటితో పాటు రెండు 15 క్యారెట్ల పింక్ మోర్గానైట్స్ ఈ హారంలో తళుకులీనాయి. ఆమె ధరించిన ఇయర్ రింగ్స్ కూడా శాఫైర్స్, మోర్గానైట్స్‌తో డిజైన్ చేయబడి ఎంతో గ్రాండ్‌గా కనిపించాయి. ఈ ఆభరణాలు ఆమె రెడ్ కార్పెట్ రూపానికి ఒక డ్రామాటిక్ మరియు పర్‌ఫెక్ట్ లుక్‌ను అందించాయి.

మంత్రముగ్ధులను చేసిన ఫ్యాషన్ కాంబినేషన్

ప్రతిష్టాత్మకమైన రెడ్ కార్పెట్‌పై ఆమె ‘ఇర్త్’ బ్రాండ్‌కు చెందిన బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ స్ట్రాప్‌లెస్ గౌనులో హొయలు పోయింది. ఈ ఫిట్టెడ్ బోడిస్ గౌన్ ఆమె లుక్‌ను మరింత ఎలివేట్ చేయగా, అందులోని షిమ్మర్ ఎఫెక్ట్ ఆమె ధరించిన వజ్రాల నగల మెరుపుతో పోటీ పడింది.

సౌత్ ఇండియన్ సినిమాకు గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రాతినిధ్యం వహిస్తూ ఎంతో ఎలిగెంట్ గా, గ్లామరస్‌గా ఆమె నడిచివచ్చిన తీరు ప్రశంసలు అందుకుంది. తన జుట్టును సాఫ్ట్ ఓపెన్ కర్ల్స్‌గా స్టైల్ చేసుకుని, సింపుల్ మేకప్ లుక్‌ను ఎంచుకుంది. ఐలైనర్ వాడకుండా ఐషాడో, బ్లష్, లిప్‌స్టిక్ వంటి వాటిని పింక్ షేడ్స్‌లోనే ఉంచేలా జాగ్రత్త పడింది. మేకప్ హెవీగా ఉండి దుస్తులు, నగల అందాన్ని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే ఆమె టీమ్ ఈ విధమైన సాఫ్ట్-గ్లామ్ లుక్‌ను ప్లాన్ చేసింది. ఈ ముద్దుగుమ్మ కాన్స్ అరంగేట్రం కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికలపై దక్షిణ భారత నటీనటులకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం.

Follow Us