ట్రైలర్ టాక్: మోడరన్ సీత ప్రేమాయణం

|

May 10, 2019 | 1:19 PM

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీత’. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అమాయకుడైన రాముడు(బెల్లంకొండ సాయి శ్రీనివాస్), ముక్కుసూటితనం, పొగరు కలగలిసిన సీత(కాజల్ అగర్వాల్), తను కోరుకున్న దాని కోసం ఎంతకైనా తెగించే రావణాసురుడు(సోను సూద్). ఈ ముగ్గురి చుట్టే ‘సీత’ సినిమా […]

ట్రైలర్ టాక్: మోడరన్ సీత ప్రేమాయణం
Follow us on

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీత’. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అమాయకుడైన రాముడు(బెల్లంకొండ సాయి శ్రీనివాస్), ముక్కుసూటితనం, పొగరు కలగలిసిన సీత(కాజల్ అగర్వాల్), తను కోరుకున్న దాని కోసం ఎంతకైనా తెగించే రావణాసురుడు(సోను సూద్). ఈ ముగ్గురి చుట్టే ‘సీత’ సినిమా కథ తిరుగుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

.