‘సీత’ రివ్యూ

|

May 24, 2019 | 12:33 PM

టైటిల్ : ‘సీత’ తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూసూద్, కోట శ్రీనివాసరావు తదితరులు సంగీతం : అనూప్ రూబెన్స్ దర్శకత్వం : తేజ నిర్మాణ బ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ విడుదల తేదీ: 24-05-2019 బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ‘మోడరన్ సీత’ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి […]

సీత రివ్యూ
Follow us on

టైటిల్ : ‘సీత’

తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూసూద్, కోట శ్రీనివాసరావు తదితరులు

సంగీతం : అనూప్ రూబెన్స్

దర్శకత్వం : తేజ

నిర్మాణ బ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్

విడుదల తేదీ: 24-05-2019

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ‘మోడరన్ సీత’ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు నిలబెట్టుకోగలిగిందో ఇప్పుడు చూద్దాం.

కథ‌ :

తన ఉన్నతి కోసం దేనికైనా తెగించే గర్వం కలిగిన అమ్మాయి సీత(కాజల్), అనుకోని పరిస్థితుల వల్ల లోకల్ ఎమ్మెల్యే బసవ(సోనూసూద్)తో 5 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోవాల్సి వస్తుంది. అయితే సీతకు దురదృష్టవశాత్తు ఈ ఒప్పందం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ఈ తరుణంలో సీత అమాయకుడైన రఘురామ్(బెల్లంకొండ శ్రీనివాస్)ను ట్రాప్ చేసి తన లక్ష్యం సాధించుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో సీత కోరిక నెరవేరిందా.? సీత బసవ నుంచి ఎలా తప్పించుకుంది.? రామ్ సీతను సమస్యల నుండి బయటపడేశాడా.? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు :

సినిమాకి ప్రధాన బలం హీరోయిన్ కాజల్ అగర్వాల్. డిఫరెంట్ షేడ్స్ కలిగి ఉన్న సీత పాత్రకు కాజల్ పూర్తి న్యాయం చేసింది. ప్రతీ సన్నివేశంలోనూ తన సహజ నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అమాయక చక్రవర్తి పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే అనిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్‌కు ఆయన నటన జీవం పోసింది. కమెడియన్ బిత్తిరి సత్తి కొంతవరకు నవ్వించగలిగాడు.

విశ్లేష‌ణ‌ :

నేటితరం అమ్మాయిలలో కనిపిస్తున్న స్వార్ధం, ధనాశ వంటి లక్షణాలను సీత పాత్రలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు తేజ. సీత పాత్రపై పెట్టిన దృష్టి.. కథనం మీద చూపించి ఉంటే సినిమా మరింత బాగా వచ్చేది.మొదటి హాఫ్ అంతా కొన్ని ఎమోషనల్, కొన్ని కామెడీ సీన్స్ తో ఇంటరెస్టింగ్ గా ఉంది. అటు సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ మినహాయిస్తే మిగతా సన్నివేశాలతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు.

సాంకేతిక విభాగాల పనితీరు:

నేటితరం అమ్మాయిలకు దర్శకుడు తేజ చెప్పాలనుకున్న థీమ్ బాగుంది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ సోసోగా ఉంది. సినిమాలో ఇంకా కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయాల్సింది. నిర్మాత అనిల్ సుంకర పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

కాజల్ అగర్వాల్ యాక్టింగ్

కొన్ని కామెడీ సీన్స్

మైనస్‌ పాయింట్స్‌ :

రొటీన్ కథనం

బలహీన సన్నివేశాలు