NTR movie with Prashanth: ఇప్పుడున్న పరిస్థితుల్లో నిదానంగా కంటే త్వరత్వరగా సినిమాలు చేయడానికే హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. ఒకవేళ భారీ బడ్జెట్ చిత్రమో లేక పెద్ద డైరెక్టర్ అయితేనో.. దానికి ఒకటి లేదా ఒకటిన్నర్ర సంవత్సరాలను కేటాయిస్తారు(రాజమౌళి సినిమాలు ఇందుకు మినహాయింపు). అలాంటిది ఎన్టీఆర్ మాత్రం ఒక దర్శకుడి కోసం రెండేళ్లు కేటాయించేందుకు సిద్ధమయ్యారట. ఆ దర్శకుడు ఎవరంటే ప్రశాంత్ నీల్. కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ఈ దర్శకుడి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్నారు. దీనిపైన అధికారిక ప్రకటన రానప్పటికీ, మైత్రీ నిర్మాతల్లో ఒకరైన నవీన్ కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమాను నిర్మించనున్నామని ఆయన చెప్పారు.
ఇక ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ రెండేళ్లు పూర్తిగా కేటాయించనున్నారట. కథ బలంగా ఉండటంతో తన డేట్లను ఇచ్చేశారట. ఫిలింనగర్ సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్రం 2023లో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ రెండేళ్లు కేటాయించడమంటే నిజంగా సాహసమనే చెప్పాలి. ఇదిలా ఉంటేఈ మూవీ కోసం ప్రశాంత్‌కి ఇప్పటికే 2కోట్ల అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ నటించనున్నారు.
Read More: