‘జెర్సీ’ జీవితాలకు స్ఫూర్తినిచ్చే సినిమా

| Edited By: Ravi Kiran

Apr 20, 2019 | 8:01 PM

ఏ బిడ్డకయినా తన తండ్రే సూపర్ హీరో. గెలిచిన ఆనందం, ఓడిన బాధ కంటే నాన్న అనే నిలువెత్తు ధైర్యం మనల్ని ముందుకు అడుగులు వేసేలా చేస్తుంది. కథను రివీల్ చేయలేము కాబట్టి.. పూర్తిగా చెప్పలేకపోతున్నాం. ‘జెర్సీ’ సినిమాలో అర్జున్ అనే ఒక వ్యక్తి జీవితం మాత్రమే కనిపిస్తుంది. లైఫ్‌లో ముందుకు వెళ్లకపోవడానికి 100 కారణాలు ఉంటాయ్..కానీ గెలవాలనుకునే ఒకే ఒక్క కారణం ముందు అవన్ని చిన్నబోతాయ్. ఒక వ్యక్తి జీవితం, భార్య భర్తల సెంటిమెంట్, తండ్రి,కొడుకుల […]

జెర్సీ జీవితాలకు స్ఫూర్తినిచ్చే సినిమా
Follow us on

ఏ బిడ్డకయినా తన తండ్రే సూపర్ హీరో. గెలిచిన ఆనందం, ఓడిన బాధ కంటే నాన్న అనే నిలువెత్తు ధైర్యం మనల్ని ముందుకు అడుగులు వేసేలా చేస్తుంది. కథను రివీల్ చేయలేము కాబట్టి.. పూర్తిగా చెప్పలేకపోతున్నాం. ‘జెర్సీ’ సినిమాలో అర్జున్ అనే ఒక వ్యక్తి జీవితం మాత్రమే కనిపిస్తుంది. లైఫ్‌లో ముందుకు వెళ్లకపోవడానికి 100 కారణాలు ఉంటాయ్..కానీ గెలవాలనుకునే ఒకే ఒక్క కారణం ముందు అవన్ని చిన్నబోతాయ్. ఒక వ్యక్తి జీవితం, భార్య భర్తల సెంటిమెంట్, తండ్రి,కొడుకుల అనుబంధం వెరసి ఓ సినిమాను సూపర్ హిట్ చేశాయి.

తెలుగు సినిమా కొత్త రూపు సంతరించుకుంటుంది. యంగ్ డైరక్టర్స్ సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తున్నారు. అందులో ఒకరు ‘జెర్సీ’ సినిమా డైరక్టర్ గౌతమ్ తిన్ననూరి. తను ఎక్కడి నుంచైనా స్ఫూర్తి పొందాడో..లేదో తెలియదు కానీ చాలా మంది జీవితాలకు మాత్రం స్ఫూర్తిగా నిలిచారు. స్క్రీన్‌పై పాత్రలు ప్రవర్తిస్తున్న తీరు, సంభాషణలు, తీసుకున్న నేపథ్యం అన్నీ కూడా మన జీవితాలలోకి తొంగి చూసినట్టే ఉంటాయ్.

నాన్న ప్రేమ.. ఎప్పటికీ అందుకోలేనంత ఎత్తు

భార్య…మన జీవితంలో రుణం తీర్చుకోలేని వ్యక్తి

కొడుకు..జీవితాంతం నాన్నను వెంటాడే ఎమోషన్

ఈ విషయాలు మనకు లైఫ్‌లో ఎప్పుడూ తారసపడేవే..వాటినే సిల్వర్ స్క్రీన్పై ‘జెర్సీ’ మరోసారి దృశ్యరూపకంగా చూపించింది.

‘జెర్సీ’ని మిస్ అయితే.. ఓ మంచి జీవితాన్ని మిస్ అయినట్టే.