
Jayalalithaa biopic Thalaivi: దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. ఏఎల్ విజయ్ దర్శకంత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి మూవీ మేకర్స్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. బుధవారం (ఫిబ్రవరి 24) జయలలిత జయంతి సందర్భంగా తలైవి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మూవీమేకర్స్. ఈ ఏడాది ఏప్రిల్ 23న ‘తలైవి’ సినిమాను విడుదల చేయనున్నట్లు మూవీమేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీంతోపాటు తలైవి టీజర్‌ను సైతం విడుదల చేశారు.
అయితే ఈ చిత్రాన్ని తమిళం, హిందీ, తెలుగు భాషలల్లో విడుదల చేయనున్నారు. మొదటగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన అనంతరం పలు భాషల్లో డబ్ చేయనున్నట్లు సమాచారం. దీంతోపాటు ‘తలైవి’ చిత్రానికి హిందీలో ‘జయ’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనిలో జయలలితా రాజకీయ జీవితంలో ఎదురుకున్న సవాళ్ళను చూపెట్టనున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించగా.. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో జయలలిత అభిమానులు, ప్రేక్షకులు తమ అభిమాన నాయకురాలి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి సినిమాతెరపై చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల కానుండటంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రభావం తమిళనాడు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
Also Read: