ఇంటికి వచ్చేసిన విజయ్ తనయుడు.. హ్యాపీలో హీరో కుటుంబం

మొత్తానికి చాలా నెలల తరువాత విజయ్‌ తనయుడు జాసోన్‌ సంజయ్‌ ఇంటికి చేరుకున్నాడు. దీంతో హీరో కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఇంటికి వచ్చేసిన విజయ్ తనయుడు.. హ్యాపీలో హీరో కుటుంబం

Edited By:

Updated on: Jul 21, 2020 | 6:37 PM

మొత్తానికి చాలా నెలల తరువాత విజయ్‌ తనయుడు జాసోన్‌ సంజయ్‌ ఇంటికి చేరుకున్నాడు. దీంతో హీరో కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. అంతేకాదు చిన్నపాటి ఫంక్షన్ చేసుకున్నారు. కాగా చదువు నిమిత్తం కెనడాకు వెళ్లిన జాసోన్ సంజయ్‌ కరోనా నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయాడు. ఇక ఇక్కడ లాక్‌డౌన్ విధించడంతో పాటు విదేశాల నుంచి విమానాలను నిలిపివేయడంతో జాసోన్‌ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో అతడి గురించి ఆలోచిస్తూ విజయ్ దిగులుగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా విదేశాలలో ఉన్న భారతీయులు ఇటీవల దేశానికి వస్తుండగా.. జాసోన్ కూడా వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజులు ఓ హోటల్‌లో క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న జాసోన్ ఇటీవలే ఇంటికి వెళ్లారు. దీంతో విజయ్ కుటుంబం సంతోషంలో నిండిపోయింది.