‘Uppena’ Movie Update : మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఈ కుర్ర హీరో హీరోగా నటించిన మొదటి సినిమా ‘ఉప్పెన’. నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి ఆదరణపోందుతున్నాయి. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైంది. అయితే, ఈ సినిమా నుంచి విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈసినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేయనున్నారు. చిత్రయూనిట్ ఈ సినిమా నుంచి ‘జల జల జలపాతం’ అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ పాటను రేపు ఉదయం విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో వైష్ణవ్ తేజ్ – హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరూ సముద్రం మధ్యలో పడవపై రొమాంటిక్ పోజ్ లో నిలబడి ఉన్నారు. ఈ పోస్టర్ ఇప్పుడు ఆకట్టుకుంటుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :