Jai Bhim: “బాధింపబడ్డ వారికి లభించని న్యాయం.. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది”

|

Oct 15, 2021 | 7:57 PM

కథల ఎంపికలో వైవిధ్యం, సహజ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో సూర్య. సూర్య తాజాగా నటించిన చిత్రం ‘జై భీమ్‌’. సోషల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీజే జ్ఙానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు...

Jai Bhim: బాధింపబడ్డ వారికి లభించని న్యాయం.. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది
Surya
Follow us on

కథల ఎంపికలో వైవిధ్యం, సహజ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో సూర్య. సూర్య తాజాగా నటించిన చిత్రం ‘జై భీమ్‌’. సోషల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీజే జ్ఙానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ దశమిని పురస్కరించుకుని ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సూర్య న్యాయవాది పాత్రలో నటించారు.

షెడ్యూల్ ట్రైబ్‎కు చెందిన ఒక మహిళకు జరిగిన అన్యాయంపై చంద్రు అనే లాయర్‌ ఎలా పోరాటం చేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొని ఆ మహిళకు న్యాయం చేశాడన్నది కథంశం. ఇందులో పోలీసుల తరఫున వాదించే లాయర్‎గా రావు రమేష్ కనిపిస్తున్నారు. ఇందులో ‘కర్ణన్’ ఫేమ్ రజిషా విజయన్ హీరోయిన్‎గా నటించారు. ‘జై భీమ్’ చిత్రానికి సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా రానుంది. ఈ సినిమాకు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ.. తర్వాత అమెజాన్‌ వేదికగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


Read Also.. T20 World Cup: క్రికెట్ గ్రౌండ్స్‌గా మారనున్న ఐనాక్స్ థియేటర్లు.. టీ 20 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రెడీ