Jacqueline Fernandez: ప్రస్తుతం శ్రీలంక (Srilanka Crisis) దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆహారం, ఇంధన వనరుల కొరతతో ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. సహాయం కోసం ఇతర దేశాల దగ్గర చేతులు చాయాల్సిన దీన పరిస్థతి దాపురించింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి లంకేయులను ఈ సమస్యలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆదేశంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిరసనకారులు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఇంటిని కూడా చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. కాగా తన మాతృభూమిలో నెలకొన్న దీన పరిస్థితులపై బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) స్పందించింది. ఆ దేశ జాతీయ జెండాను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది.
‘శ్రీలంక యువతిగా నా దేశం, నా దేశ ప్రజల దీనపరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న అభిప్రాయాలను విని బాగా విసిగిపోయాను. నేను చెప్పేది ఏంటంటే.. కంటికి కనిపించిన దాని ఆధారంగా ఈ సంక్షోభానికి కారణమంటూ ఏ ఒక్కరినీ తొందరపడి దూషించకండి. ఈ సమయంలో శ్రీలంక ప్రజలకు కేవలం సానుభూతి, మద్దతు అవసరం. అక్కడి పరిస్థితి గురించి తప్పుగా మాట్లాడం కంటే వారి క్షేమం కోసం 2 నిమిషాలు మౌనం పాటించండి చాలు. వారికి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. అతి తొందర్లోనే దేశం, దేశప్రజలు ఈ కఠిన పరిస్థితుల నుంచి బయటపడతారని నేను ఆశిస్తున్నాను. ఇందుకోసం వారికి అపారమైన శక్తి, సామర్థ్యాలు చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని రాసుకొచ్చింది జాక్వెలిన్. కాగా ఇటీవల జాన్ అబ్రహంతో కలిసి అటాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ శ్రీలంక బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో సుదీప్ విక్రాంత్ రోణ, సర్కస్, రామ్ సేతు తదితర సినిమాలున్నాయి.
Also Read: ఎమ్మెల్యే బాలకృష్ణకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. పీఏ బాలాజీ డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు
MS Dhoni: ధోని అద్భుతమైన స్టంపింగ్ మీరు చూశారా..
MS Dhoni: ధోని అద్భుతమైన స్టంపింగ్ మీరు చూశారా..