Punch Prasad: చిన్న వయసులోనే 2 కిడ్నీలు పాడవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన జబర్దస్త్ పంచ్ ప్రసాద్..

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తన ఆరోగ్య సమస్యలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రసాద్‌కు జబర్దస్త్ కుటుంబం, ముఖ్యంగా నాగబాబు, రోజా, శ్రీను, రామ్ ప్రసాద్ వంటి వారు ఆర్థికంగా, నైతికంగా ఎంతగానో అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తన భార్య కిడ్నీ దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలో శస్త్రచికిత్స చేయించుకుంటానని తెలిపారు.

Punch Prasad: చిన్న వయసులోనే 2 కిడ్నీలు పాడవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన జబర్దస్త్ పంచ్ ప్రసాద్..
Punch Prasad

Updated on: Oct 30, 2026 | 6:38 PM

జబర్దస్త్ వేదికపై తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన పంచ్ ప్రసాద్, తెరవెనుక తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కమెడియన్ తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సవాళ్ల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. దేవుడు తన జీవితంలో అనేక పరీక్షలు పెట్టాడని, విజయం ఆలస్యంగా వచ్చినప్పటికీ, ఆరోగ్య సమస్యల కారణంగా తరచు వెనకడుగు వేయాల్సి వచ్చిందని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బీపీ ఉందని తెలియకపోవడమే తన రెండు కిడ్నీలు పాడవడానికి కారణమని ప్రసాద్ వెల్లడించారు. ఎంగేజ్‌మెంట్ సమయంలోనే తన అనారోగ్య సమస్య బయటపడిందని, తన స్థానంలో వేరొకరు ఉంటే ఈ వివాహానికి ఒప్పుకునేవారు కాదన్నారు. ఒకసారి షూట్ తర్వాత ఇంటికి వెళ్లినప్పుడు ముక్కు, నోటి నుండి రక్తం పడిందని, ఆ సమయంలో శ్రీను, రామ్ ప్రసాద్ వంటి స్నేహితులు తక్షణమే స్పందించి స్టార్ హాస్పిటల్‌లో చేర్చారని గుర్తు చేసుకున్నారు. శ్రీను అన్నయ్య ఏకంగా 50 వేలు ఇచ్చి అడ్మిట్ చేశారని, సాధారణంగా ఎవరూ ఇలాంటి సహాయం చేయరని ప్రసాద్ కంటతడి పెట్టుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

తీవ్ర అనారోగ్యంతో కుమిలిపోయిన దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా తనలో కలిగిందని ప్రసాద్ ధైర్యంగా ఒప్పుకున్నారు. అలాంటి సంక్లిష్ట సమయంలో నాగబాబు గారు ఫోన్ చేసి “మేం ఉన్నాం రా, నీకేం కాదురా” అని ధైర్యం చెప్పారని తెలిపారు. నాగబాబు చొరవతోనే జబర్దస్త్ టీం లీడర్స్, రోజా, మిగతా సభ్యులు అందరూ కలిసి తన ఆపరేషన్‌కు అవసరమైన నిధులను సమకూర్చారని ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రసాద్‌కు కిడ్నీ దానం చేయడానికి ఆయన భార్య ముందుకు వచ్చారని, అయితే ఆమె అప్పట్లో గర్భవతి కావడంతో శస్త్రచికిత్స వాయిదా పడిందని చెప్పారు. ఆ తర్వాత పుట్టిన బాబు కూడా ఆరు నెలల పాటు బాగా బరువు తగ్గి ఇబ్బంది పడ్డాడని, ప్రస్తుతం కోలుకొని యాక్టివ్‌గా ఉన్నాడని ప్రసాద్ తెలిపారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూనే, డయాలసిస్ చేయించుకుంటూ జబర్దస్త్ షోలలో పాల్గొని తన ఆరోగ్య పరిస్థితిపై కూడా జోకులు వేస్తూ అందరినీ నవ్వించిన ప్రసాద్, ఇటీవల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కిడ్నీ మార్పిడి అనివార్యమైంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాతలను అభ్యర్థించిన ఆయనకు, అప్పటి జబర్దస్త్ జడ్జ్ రోజా చొరవతో కిడ్నీ దాత కూడా లభించారు. ప్రస్తుతం కోలుకుంటున్న ప్రసాద్ తన జబర్దస్త్ కుటుంబానికి, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

తన కుటుంబ సభ్యుల కంటే కూడా జబర్దస్త్ కుటుంబం, ముఖ్యంగా వెంకీ, టీం లీడర్స్, డైరెక్టర్స్, నాగబాబు, రోజా, మల్లెమాల సంస్థ తనకు నైతికంగా, ఆర్థికంగా ఎంతో అండగా నిలిచాయని ప్రసాద్ తెలిపారు. వారి అండదండలతోనే తాను ఈ సవాళ్లను ఎదుర్కొని నిలబడగలుగుతున్నానని, జబర్దస్త్ కుటుంబానికి రుణపడి ఉంటానని ప్రసాద్ పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితిని ఒక కాంట్రవర్సీగా చూడవద్దని, ఇది తన నిజ జీవిత పోరాటమని ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Loading...
Unable to load recommendations.
Follow Us