Jabardasth Rohini: వేరే వాళ్లు అయితే చెప్పుతో కొట్టేదాన్ని.. ఇచ్చిపడేసిన జబర్దస్త్ రోహిణి

|

Jul 12, 2024 | 8:11 PM

బర్త్ డే బాయ్ అనే సినిమాకోసం జబర్దస్త్ ఫెమ్ రోహిణి ఓ రేవ్ పార్టీలో దొరికిపోయినట్టు ఓ ఫన్నీ వీడియో చేశారు. ఇప్పటికే టాలీవుడ్ నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. హేమకు సంబందించిన రేవ్ పార్టీ యవ్వారం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. వారం పది రోజులు న్యూస్ లో నిలిచింది ఈ హేమ వ్యవహారం.

Jabardasth Rohini: వేరే వాళ్లు అయితే చెప్పుతో కొట్టేదాన్ని.. ఇచ్చిపడేసిన జబర్దస్త్ రోహిణి
Rohini
Follow us on

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా జరుగుతున్నాయి. ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు సినిమా వాళ్లు.. సోషల్ మీడియా వాడకం ఎక్కువైనా ఈ కాలంలో సినిమా ప్రమోషన్స్ కూడా అదే స్టైల్ లో చేస్తున్నారు సినిమా టీమ్స్.. ఏదైతే వైరల్ అవుతుందో.. జనాలోకి ఏది అయితే ఎక్కువగా వెళ్తుందో ప్రమోషన్స్ కూడా అలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బర్త్ డే బాయ్ అనే సినిమాకోసం జబర్దస్త్ ఫెమ్ రోహిణి ఓ రేవ్ పార్టీలో దొరికిపోయినట్టు ఓ ఫన్నీ వీడియో చేశారు. ఇప్పటికే టాలీవుడ్ నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. హేమకు సంబందించిన రేవ్ పార్టీ యవ్వారం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. వారం పది రోజులు న్యూస్ లో నిలిచింది ఈ హేమ వ్యవహారం.

అయితే ఇదే థీమ్ తో రోహిణి తన సినిమా ప్రమోషన్స్ చేశారు. రేవ్ పార్టీలో దొరికినట్టు ఓ వీడియో చేసింది రోహిణి. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఆతర్వాత అది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిందని తెలిసి నవ్వుకున్నారు. అయితే ఒక జర్నలిస్ట్ మాత్రం ఆమె పై కాంట్రవర్షల్ కామెంట్స్ చేశారు. నిప్పులేనిదే పొగ రాదు. ఆమె రేవ్ పార్టీకి వెళ్లే ఉంటుంది అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. దాంతో ఆయన పై రోహిణి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ఈ వీడియోలో మాట్లాడుతూ..

“నేను బర్త్ డే బాయ్ అనే సినిమాకి ప్రమోషన్స్ చేశాను. అది వీడియో ప్రమోషనల్ కోసం చేశానని తెలుసుకొని మీడియా కూడా దానినిఫన్నీ వీడియోగా తీసుకున్నారు.  కానీ, సీనియర్ జర్నలిస్ట్ నా గురించి తప్పుగా మాట్లాడారు. ఓ వీడియోలో కూర్చుని నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. రేవ్ పార్టీ అనగానే నిజంగానే దొరికే ఉంటుంది. నిప్పులేకుండా పొగ రాదు కదా..!అని అన్నారు. ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి. ఏమీ తెలియకుండా ఇష్టమొచ్చినట్టు ఎలా మాట్లాడతారు.? పైగా అయినా సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తున్నారు. మరి.. అలా ఎలా మాట్లాడతారు. నేను మందు కూడా తాగను. సినిమాలో చూపించేవి అన్ని నిజం కాదు. అలాగే ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు. నేను సర్జరీ చేయించుకోవడం వల్లే లావు అయ్యాను అని అందుకే పెళ్లి కాలేదు అందుకే అలా ఉండిపోయింది అని అన్నాడు. లావు గా ఉంటే పెళ్లి కాదా.? సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టే దాన్ని” అని గట్టిగా చెప్పింది రోహిణి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.