టీటీడీ బోర్డు మెంబర్‌గా దిల్ రాజు..?

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడన్న సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకగా తన బ్యానర్‌కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని పేరు పెట్టి.. తన ప్రతీ సినిమా విడుదల ముందు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం రాజుకు ఆనవాయితీ. ఇది ఇలా ఉండగా రాజుకు టీటీడీ బోర్డులో సభ్యుడు కావాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని సన్నిహితుల సమాచారం. కాగా ఇప్పుడు ఆ కల నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ […]

టీటీడీ బోర్డు మెంబర్‌గా దిల్ రాజు..?

Updated on: Jun 23, 2019 | 7:23 AM

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడన్న సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకగా తన బ్యానర్‌కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని పేరు పెట్టి.. తన ప్రతీ సినిమా విడుదల ముందు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం రాజుకు ఆనవాయితీ. ఇది ఇలా ఉండగా రాజుకు టీటీడీ బోర్డులో సభ్యుడు కావాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని సన్నిహితుల సమాచారం. కాగా ఇప్పుడు ఆ కల నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. టీటీడీ బోర్డును పూర్తిగా మారుస్తున్న నేపథ్యంలో వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన నేతృత్వంలో దిల్ రాజు కూడా టీటీడీ సభ్యుడు అవుతాడని వార్తలు వస్తున్నాయి. ఇటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో రాజుకు సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల.. వైఎస్ జగన్‌కు కేటీఆర్ సిఫార్సు చేశారని.. అందుకు జగన్ కూడా అంగీకరించారని ప్రచారం జరుగుతోంది.