మెగాస్టార్ ప్రయోగం.. ‘చిరు 152’పై కొత్త అప్‌డేట్

| Edited By:

Aug 01, 2019 | 9:05 AM

తన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డిని పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల మూవీ కోసం సిద్ధమవుతున్నారు. చిరు పుట్టినరోజు ఆగష్టు 22న ఈ మూవీని ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో చిరు డ్యూయల్ రోల్‌లో కనిపించనుండగా.. అందులో ఒకటి నక్సలైట్ పాత్ర అని తెలుస్తోంది. మూవీ మొత్తం నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని.. ఇక నక్సలైట్ పాత్ర […]

మెగాస్టార్ ప్రయోగం.. ‘చిరు 152’పై కొత్త అప్‌డేట్
Follow us on

తన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డిని పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల మూవీ కోసం సిద్ధమవుతున్నారు. చిరు పుట్టినరోజు ఆగష్టు 22న ఈ మూవీని ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో చిరు డ్యూయల్ రోల్‌లో కనిపించనుండగా.. అందులో ఒకటి నక్సలైట్ పాత్ర అని తెలుస్తోంది.

మూవీ మొత్తం నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని.. ఇక నక్సలైట్ పాత్ర కోసం చిరు అక్కడక్కడా నెరిసిన జట్టుతో కనిపిస్తారని తాజా సమాచారం. తన ప్రతి సినిమాలో సామాజిక సందేశాన్ని ఇచ్చే కొరటాల.. చిరు కోసం అదిరిపోయే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని టాక్. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ మరోసారి జోడీ కట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.