Pawan kalyan-Harish Shankar Movie : ఈ సారి పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ అలా చూపించబోతున్నాడట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి  అయ్యప్పన్ కోషియమ్  రీమేక్ ను పట్టాలెల్లించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా రానా నటిస్తున్నాడు..

Pawan kalyan-Harish Shankar Movie : ఈ సారి పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ అలా చూపించబోతున్నాడట..!

Updated on: Jan 04, 2021 | 2:11 PM

Pawan kalyan-Harish Shankar Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ‘అయ్యప్పనుమ్ కోషియం’  రీమేక్ ను పట్టాలెల్లించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా రానా నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటు క్రిష్ , హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలు కమిట్ అయ్యాయి ఉన్నాడు పవన్. తాజాగా హరీష్ శంకర్ పవన్ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ రూమర్ ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

హరీష్ శంకర్ గతంలో పవన్ ను పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో చూపించారు. ఇప్పుడు ఐబీ ఆఫీసర్ గా చూపించనున్నాడని టాక్. ఇప్పటికే ఇందుకు సంబందించిన కథను కూడా సిద్ధం చేసాడట హరీష్. ఈ స్క్రిప్ట్ కు క్రిష్ కూడా తనవంతు సహకారం అందించారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక దేశ భక్తి కలిగి ఉండే సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సినిమాను కూడా  పట్టాలెక్కిన్చానున్నాడట. ఇదే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా హరీష్ ప్లాన్ చేస్తున్నాడట.

also read : Sharwanand : కోన చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో.. మెడికల్ థ్రిల్లర్ లో శర్వానంద్