Indian 2 Accident: ‘ఇండియన్ 2’ ప్రమాదం.. కమల్, శంకర్‌లకు సమన్లు..!

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 5:03 PM

ఇండియన్ 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదంపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో నిర్మాతలు, క్రేజ్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్‌ పేర్లు పొందపరిచారు. అలాగే నటుడు కమల్‌హాసన్,

Indian 2 Accident: ఇండియన్ 2 ప్రమాదం.. కమల్, శంకర్‌లకు సమన్లు..!
Follow us on

ఇండియన్ 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదంపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో నిర్మాతలు, క్రేజ్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్‌ పేర్లు పొందపరిచారు. అలాగే నటుడు కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌కు సమన్లు జారీ అయ్యాయి.

అయితే బుధవారం ఇండియన్ 2 షూటింగ్‌ జరుగుతున్న సమయంలో పెద్ద క్రేన్ విరిగిపడింది. ఈ ఘటనలో ఓ అసిస్టెంట్ డైరక్టర్, ఓ సెట్ అసిస్టెంట్, ఓ ప్రొడక్షన్ అసిస్టెంట్ మృతి చెందారు. మరో పది మందికి పైగా గాయాలయ్యాయి. అంతేకాదు దర్శకుడు శంకర్‌కు కూడా గాయాలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దానిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ ఘటనపై నిర్మాణ సంస్థ లైకా సంస్థ సానుభూతిని వ్యక్తపరిచింది.

Read This Story Alos:’ఇండియన్ 2′ ప్రమాదం.. అక్కడ షూటింగ్ చేస్తే ప్రమాదాలు తప్పవా..!