తెలుగు సినిమా ప్రియులకు ఐబొమ్మ (iBOMMA) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓటీటీలో విడుదలైన సినిమాలను హెచ్‌డీ క్వాలిటీ ఫ్రింట్‌తో ఉచితంగా అందిస్తోందీ వెబ్‌సైట్. ఓటీటీల్లో సినిమాలు చూడలేని వారు ఎంచెక్కా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తమకు నచ్చిన సినిమాలను చూసేస్తుంటారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ వెబ్‌సైట్ నిర్వహణ కష్టంగా ఉందని, తమపై అనవసర దుష్ర్పచారం చేస్తుండడంతో వెబ్‌సైట్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు తెలిపింది ఐబొమ్మ. అయితే ఎందుకో కానీ ఆ విషయంలో వెనక్కు తగ్గింది. తాజాగా ఈ వెబ్‌సైట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపుగా డిజిటల్ స్ట్రీమింగ్‌లో వచ్చిన సినిమాలు అన్నీ ఐ బొమ్మ ఉండేవి. యూజర్లు సెర్చ్ ఆప్షన్‌లోకి వెళ్లి.. మరీ మనకు నచ్చిన సినిమాలు ఆన్‌లైన్‌లో లేదా డౌన్‌లోడ్ చేసుకుని చూసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు అవకాశం లేదు. భారత యూజర్లు కేవలం వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసిన చివరి 30 సినిమాలు మాత్రమే చూడవచ్చని వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఐ బొమ్మ ప్రకటించింది.
సెర్చ్ ఆప్షన్ కూడా..
అది కూడా ప్రస్తుతానికి టెంపరరీగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయితే పూర్తి సినిమాలను చూసే విధంగా ఎప్పటి నుంచి మళ్లీ అవకాశం కల్పిస్తారన్న విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా ప్రస్తుతం ఐబొమ్మ వెబ్‌సైట్‌లో సెర్చ్ ఆప్షన్ కూడా కనిపించకుండా డిసేబుల్ చేశారు. గతంలో వెబ్‌సైట్ మూసి వేయడానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న సమయంలో నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని చెప్పుకొచ్చింది ఐ బొమ్మ యాజమాన్యం. మేము ప్యాషన్ తో పనిచేస్తోంటే తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాపోయింది. అయితే అసలు ఏం జరిగిందనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వ లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..