ఇక చాలంటూ.. బాలీవుడ్‌కి ప్రముఖ దర్శకుడు గుడ్‌బై

బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పారు ప్రముఖ దర్శకుడు అనుభవ్‌ సిన్హా. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసిన అనుభవ్‌‌ ''ఇక చాలు.

ఇక చాలంటూ.. బాలీవుడ్‌కి ప్రముఖ దర్శకుడు గుడ్‌బై

Edited By:

Updated on: Jul 23, 2020 | 10:56 AM

బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పారు ప్రముఖ దర్శకుడు అనుభవ్‌ సిన్హా. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసిన అనుభవ్‌‌ ”ఇక చాలు. బాలీవుడ్‌కి రాజీనామా చేస్తున్నా. జరిగింది చాలు” అంటూ కామెంట్ పెట్టారు. అంతేకాదు ట్విట్టర్‌లో తన ప్రొఫైల్‌ని సైతం అభినవ్ సిన్హా(నాట్ బాలీవుడ్‌) అంటూ మార్చుకున్నారు. అయితే ఆ తరువాత ‘‘బాలీవుడ్‌కి రాజీనామా చేస్తున్నాను కానీ సినిమాలు చేస్తాను’’ అనుభవ్‌ క్లారిటీ ఇచ్చారు.

కాగా 2001లో కెరీర్‌ని ప్రారంభించిన అనుభవ్‌.. రా.వన్‌, ముల్క్‌, ఆర్టికల్ 15, తప్పడ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. గులాబ్‌ గ్యాంగ్‌, జిద్‌ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే బాలీవుడ్‌లో దాదాపు 20 ఏళ్లుగా ఉంటున్న ఈ దర్శకుడు ఉన్నట్లుండి రాజీనామా ప్రకటించడానికి గల కారణాలు తెలియడం లేదు. ఇక అనుభవ్ ట్వీట్‌కి.. పలువురు ఫిలిం మేకర్లు, నెటిజన్లు స్పందిస్తున్నారు.