Hrithik Roshan: అభిమానుల కోరిక నిజం కాబోతుంది. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, బ్యూటిఫుల్ దీపికా పదుకొనే ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పై రొమాన్స్ చేయబోతున్నారు. ఈ మేరకు హృతిక్ పుట్టినరోజు సందర్భంగా చేసిన బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ‘వార్’ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో ‘ఫైటర్’ పేరుతో వస్తున్న ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్. కాగా సిద్దార్థ్ ఆనంద్, హృతిక్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను మార్‌ఫ్లిక్స్ బ్యానర్ రూపొందిస్తోంది. సెప్టెంబర్ 30, 2022న రిలీజ్ కానుండగా దీపిక, హృతిక్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుపుతూ ఇద్దరూ కలిసి నటించేందుకు ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపారు. మరి ఈ నూతన సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.
Gold Coins: ఆ నదిలో బంగారు నాణేలు దొరుకుతున్నాయట.. నిద్రాహారాలు మాని చెరువును తవ్వుతున్న జనాలు..