హోటల్ మేనేజర్‏గా అవతారమెత్తనున్న బాలీవుడ్ స్టార్ హీరో.. డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ !..

| Edited By: Pardhasaradhi Peri

Dec 28, 2020 | 9:31 AM

లాక్‏డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూత పడడంతో దేశంలో ఓటీటీ ఫ్లాట్‏ఫాం దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు డిజిటల్ మీడియాలోకి

హోటల్ మేనేజర్‏గా అవతారమెత్తనున్న బాలీవుడ్ స్టార్ హీరో.. డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ !..
Follow us on

లాక్‏డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూత పడడంతో దేశంలో ఓటీటీ ఫ్లాట్‏ఫాం దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఓ వెబ్ సిరీస్‏లో నటించనున్నట్లుగా సమాచారం.

అయితే ఈ వెబ్ సిరీస్‏లో హృతిక్ హోటల్ మేనేజర్‏గా నటించున్నట్లుగా తెలుస్తోంది. హోటల్‏లో జరిగే అవినీతి పనులు, అవినీతి పరుల పనిపట్టే మేనేజర్‏గా హృతిక్ కనిపించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్‏తో హృతిక్ ఓటీటీలోకి అరంగేట్రం చేయబోతున్నారు. హాలీవుడ్ టీవీ సిరీస్ దినైట్ మేనేజర్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‏ను తెరకెక్కించనున్నట్లుగా సమాచారం. ఈ సిరీస్‏కు సందీప్ మోదీ దర్శకత్వం వహించనున్నారు. డిస్నీ+ హాట్ స్టార్‏లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా టాక్.