శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి హీరోలుగా నూతన చిత్రం… శేఖ‌ర్ రెడ్డి యెర్ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమా…

శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి హీరోలుగా '90 ఎంఎల్' ఫేమ్ శేఖ‌ర్ రెడ్డి యెర్ర ద‌ర్శ‌క‌త్వంలో నూతన చిత్రం ప్రారంభమైంది. సినిమాకు 'హౌస్ అరెస్ట్' అనే పేరును ఖరారు చేశారు. కె. నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మొదలుపెట్టారు.

శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి హీరోలుగా నూతన చిత్రం... శేఖ‌ర్ రెడ్డి యెర్ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమా...

Edited By:

Updated on: Dec 10, 2020 | 8:37 PM

House Arrest: Primeshow Entertainment launched their production No 3 with director SekharReddy Yerra and cast Srinivas Reddy, Saptagiri and others  శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి హీరోలుగా ’90 ఎంఎల్’ ఫేమ్ శేఖ‌ర్ రెడ్డి యెర్ర ద‌ర్శ‌క‌త్వంలో నూతన చిత్రం ప్రారంభమైంది. సినిమాకు ‘హౌస్ అరెస్ట్’ అనే పేరును ఖరారు చేశారు. కె. నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మొదలుపెట్టారు.

 

రెగ్యుల‌ర్ షూటింగ్ సైతం ప్రారంభమైంది. శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్త‌గిరిల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి స్టార్ డైరెక్ట‌ర్ బాబీ క్లాప్ నిచ్చారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చోటా కె. ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. చంద్ర‌బోస్ సాహిత్యం అందిస్తున్నారు.