Avatar 2: అవతార్ 2 తెలుగు వెర్షన్‌కు డైలాగ్స్ రాసింది ఎవరో తెల్సా.. ఆ యాక్టర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్

|

Dec 14, 2022 | 5:40 PM

ప్రజెంట్ వరల్డ్ మూవీ లవర్స్ అంతా అవతార్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్‌ అవతార్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా జరిగింది.

Avatar 2: అవతార్ 2 తెలుగు వెర్షన్‌కు డైలాగ్స్ రాసింది ఎవరో తెల్సా.. ఆ యాక్టర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్
Avatar 2
Follow us on

కిరాక్‌.. తురుమ్‌.. వావ్‌.. మార్వ్‌లెస్‌.. వెయ్యి బాహుబలులతో సమానం..ఇవన్నీ అవతార్‌ ద వే ఆఫ్‌ వాటర్‌కు చాలా చిన్నవి. అదో విజువల్‌ వండర్‌.. అవతార్‌ అద్భుతాలు ఇన్ని అని చెప్పలేం.. ప్రతి సీన్‌ ఊహకందని కాన్వాస్‌. ప్రపంచ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌..అవతార్‌ విడుదలైన చాలా ఏళ్లకు వస్తోన్న ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఇటీవలే విడుదల ట్రైలర్‌.. ఆడియన్స్‌లో టన్నుల టన్నుల క్యూరియాసిటీ పెంచేసింది.. పండోరా గ్రహాన్ని మించిన అద్భుతాలు ఇందులో ఉంటాయని చిత్రబృందం ముందు నుంచి చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే సముద్రగర్భంలోని సన్నివేశాలు ఉన్నాయని అవతార్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఫస్ట్ పార్ట్ ట్రెమండస్ హిట్ కొట్టడంతో సీక్వెల్ కోసం పుష్కర కాలంగా జనం వెయిట్ చేస్తున్నారు. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవతార్‌ సముద్ర శిల్పం.. డిసెంబరు 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే బుకింగ్స్‌ బాక్సాఫీసు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి.

తెలుగు  వెర్షన్‌ డైలాగ్స్ రాసిన అవసరాల

అవతార్ తెలుగు వెర్షన్ డైలాగ్స్ ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన అవసరాల శ్రీనివాస్ రాశారు. ఆయన కామెడీ, భావోద్వేగంతో కూడిన డైలాగ్స్ అద్భుతంగా రాస్తారు. అంతేకాదు.. ప్రతి అంశాన్ని చాలా సున్నితంగా డీల్ చేస్తారు. ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించదు. గతంలో గోల్కొండ హైస్కూల్ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. ఊహలు గుసుగుసలాడే, జో అచ్చుతానంద సినిమాలకు ఆయనే రైటర్, డైరెక్టర్. దీంతో అవసరాల తన పెన్నుతో అవతార్ ప్రేక్షకులను థ్రిల్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

టికెట్లు దొరకుడు కష్టమే

ఈ ఏడాది వేసవిలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాల తర్వాత అంత డిమాండ్ ఏ సినిమాకూ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఒక పర భాషా చిత్రం టికెట్లు సంపాదించడం శక్తికి మించిన పని అయ్యేలా కనిపిస్తోంది. ఆ సినిమానే.. అవతార్‌-2. 13 ఏళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించిన అవతార్ కు ఇది సీక్వెల్. మన సూపర్ స్టార్ల సినిమాలకు ధీటుగా, ఇంకా చెప్పాలంటే అంతకుమించిన క్రేజ్ కనిపిస్తోంది అవతార్ విషయంలో. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్లు ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా ఉండడం.. జేమ్స్ కామెరూన్ మరోసారి ప్రేక్షకులను ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లేలా కనిపిస్తుండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహలాడిపోతున్నారు ప్రేక్షకులు.  మొదటి అవతార్ సినిమా చూసిన అనుభూతే అద్భుతం అంటే.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగిన టెక్నాలజీతో వేరే లేవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు కామెరూన్.

డిసెంబర్ 16నే విడుదల

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో పలు భాషల్లో డిసెంబర్ 16న విడుదల కానుంది. ఫస్ట్‌ అవతార్‌ 20 వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది.. ఇప్పటి వరకు దీన్ని బీట్‌ చేసిన సినిమా ఏదీ లేదు. ఎవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ కూడా అవతార్‌ను క్రాస్‌ చేయలేకపోయింది. ఇప్పుడు అవతార్‌ 2 ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో. పండోరా అనే జాతికి సంబంధించిన కథ ఇది. అవతార్ అనే భూమి మీద పండోరా జాతిని రక్షించేందుకు యుద్ధం జరిగితే.. ఈ సీక్వెల్‌‌లో నీటి అడుగున యుద్ధం జరగనుంది. సముద్రంపై పండోరా జాతి ప్రయాణం, వారి జీవన విధానం, యుద్ధంలో వారి తెగువను దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుతంగా చిత్రీకరించారు. ట్రైలర్‌లో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు కనిపించాయి. ఇక సినిమాలో యాక్షన్ సీన్లు అదిరిపోనున్నాయి.

అవతార్‌ ద వే ఆఫ్‌ వాటర్‌ మూవీ బడ్జెట్‌ 2 వేల కోట్లపైనే.. తెలుగు రైట్స్‌ వంద కోట్లకు పైనే పలుకుతున్నాయట. విడుదలైన రోజే భారీ కలెక్షన్‌ రావొచ్చని సినీ పండితుల అంచనా. మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ అవతార్‌.. థియేటర్‌లో కూర్చుని సముద్రంలో జర్నీ చేయడానికి ఎంతో టైమ్‌ లేదు.. కామెరూన్‌ కా కమాల్‌.. అవతార్‌ కోసం ఎవ్రీ వన్‌ ఈగర్లీ వెయిటింగ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.