Robbie Coltrane: సినీ పరిశ్రమలో విషాదం.. హ్యారీ పోటర్ నటుడు మృతి..

|

Oct 15, 2022 | 7:52 AM

హ్యారీ పోటర్ చిత్రాలలో హాగ్రిడ్ పాత్ర పోషించిన స్కాటిష్ నటుడు రాబీ కోల్ట్రేన్ (72) మృతి చెందారు. స్కాట్లాండ్‏లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో శుక్రవారం రాబీ తుదిశ్వాస విడిచారు.

Robbie Coltrane: సినీ పరిశ్రమలో విషాదం.. హ్యారీ పోటర్ నటుడు మృతి..
Actor Robbie Coltrane
Follow us on

హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. హ్యారీ పోటర్ చిత్రాలలో హాగ్రిడ్ పాత్ర పోషించిన స్కాటిష్ నటుడు రాబీ కోల్ట్రేన్ (72) మృతి చెందారు. స్కాట్లాండ్‏లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో శుక్రవారం రాబీ తుదిశ్వాస విడిచారు. అయితే రాబీ మరణించడానికి గల కారణాలు తెలియరాలేదు. రాబీ మరణం పట్ల హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతను ఐటీవీ డిటెక్టివ్ డ్రామా క్రాకర్..జేమ్స్ బాండ్ చిత్రాలలో కనిపించారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన హ్యారీ పోటర్ సిరీస్‏లో హాగ్రిడ్ పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు. 2001 నుంచి 2011 మధ్య విడుదలైన మొత్తం ఎనిమిది హ్యారీ పోటర్ చిత్రాలలో బాల మాంత్రికుడికి గురవుగా .. స్నేహితుడిగా వ్యవహరించే సున్నితమైన హాఫ్ జెయింట్ పాత్రను పోషించాడు.

అలాగే.. పియర్స్ బ్రాస్నన్‌తో కలిసి “గోల్డేనీ” (1995), “ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్” (1999) — రెండు జేమ్స్ బాండ్ చిత్రాలలో కోల్‌ట్రేన్ మాజీ KGB ఏజెంట్‌గా మారిన రష్యన్ మాఫియా బాస్‌గా కూడా నటించాడు. క్రాకర్ డ్రామాలో హార్డ్ బిటెన్ పాత్రకు గానూ మూడు సంవత్సరాల బ్రిటీష్ అకాడమీ టెలివిజన్ అవార్డ్స్ (BAFTA)లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. అతను చివరిసారిగా హ్యారీ పాటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్స్‌లో కనిపించాడు.

హ్యారీ పోటర్ రచయిత JK రౌలింగ్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. “నేను రాబీ లాంటి వ్యక్తిని మరలా ఎప్పటికీ కలుసుకోలేను. అతను అద్భుతమైన ప్రతిభావంతుడు.అతనితో కలిసి పని చేయడం.. మళ్లీ తనను కలుసుకునే అదృష్టం నాకు లేదు. నేను నా ప్రేమను పూర్తిగా అతనితో పంపుతున్నాను. అతని కుటుంబానికి, అతని పిల్లలందరికీ ప్రగాఢ సానుభూతి.” అంటూ రాసుకొచ్చారు. గ్లాస్గో సమీపంలోని రూథర్‌గ్లెన్‌లో మార్చి 30, 1950న ఆంథోనీ రాబర్ట్ మెక్‌మిలన్‌గా జన్మించాడు. టెలివిజన్‌లో, అతను 1987లో కల్ట్ బాఫ్టా-విజేత BBC మినీ-సిరీస్ “టుట్టి ఫ్రూటీ”లో ఎమ్మా థాంప్సన్‌తో కలిసి నటించాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.