Hero Sunil: కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఆ తర్వాత హీరోగా అందాల రాముడు, మర్యాద రామన్న వంటి హిట్ సినిమాలు చేశాడు. తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నాడు. తర్వాత కమెడియన్ పాత్రలు కాకుండా కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు సునీల్. తాజాగా సునీల్ హీరోగా నటిస్తున్న చిత్రం వేదాంతం రాఘవయ్య. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు కథను అందించడంతోపాటు చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నాడు. 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట- గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సి. చంద్రమోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా శనివారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమం చేసి షూటింగ్ ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ ముహ్హూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టడంతోపాటు మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించాడు. నిర్మాత గోపి ఆచంట కెమెరా స్విచాన్ చేశాడు. తర్వలోనే వేదాంతం రాఘవయ్య సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
Also Read: మరోసారి హీరోగా మారనున్న సునీల్. ‘ఆహా’ ఓటీటీలో వచ్చిన కన్నడ సినిమాను రీమేక్ చేయనున్న సునీల్.
మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్న కమెడియన్ కమ్ హీరో..? ఈసారి ఎర్రచందనం స్మగ్లర్‌గా.?