Sundeep Kishan New Movie: ఆ డైరెక్టర్‏తో సందీప్ కిషన్ కొత్త సినిమా… ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్..

|

Dec 09, 2020 | 2:15 PM

వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో సందీప్ కిషన్. తాజాగా ఈ హీరో ఎంవీవీ బ్యానర్‏లో మరో కొత్త సినిమాను చేస్తున్నాడు.

Sundeep Kishan New Movie: ఆ డైరెక్టర్‏తో సందీప్ కిషన్ కొత్త సినిమా... ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్..
Follow us on

వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో సందీప్ కిషన్. తాజాగా ఈ హీరో ఎంవీవీ బ్యానర్‏లో మరో కొత్త సినిమాను చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్‏ను కూడా ఫిక్స్ చేసారట. తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమాకు “రౌడీబేబీ” అనే టైటిల్‏ను ఖరారు చేసినట్టుగా తెలిసింది. ఈ మూవీలో సందీప్ కిషన్‏కు జంటగా హీరోయిన్ నేహ శెట్టి నటించబోతుంది. నేహ శెట్టి మెహబూబా సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సందీప్ కిషన్ నటిస్తున్న ఈ రౌడిబేబీ అనే సినిమా పూర్తిగా లవ్ యాంగిల్‏లో వస్తుందని టాక్. ఇక ఈ మూవీ షూటింగ్ ఈ నెల 16 నుంచి విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. సింగిల్ షెడ్యూల్‏లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేయనున్నట్లుగా తెలుస్తోంది.