టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. అయితే సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కొత్తవాళ్లను అవకాశం కల్పిస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసిన ఆయన తాజాగా మరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే రవితేజ వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో త్వరలో బ్లక్ బస్టర్ హిట్ ను ప్రేక్షకులకు అందించాల్సి ఉంది. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ మంచి హిట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ కోసం హరీష్ శంకర్ తో కలిసి పని చేస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ చిత్రం రైడ్ కు రీమేక్.
ఈ ఏడాది జూలైలో ఈ సినిమా విడుదల కానుండగా, దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇక అనుదీప్ కేవీతో రవితేజ చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయనుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ కామిక్ ఎంటర్ టైనర్ ను నిర్మించనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ మరో మూవీ కోసం చర్చలు జరుపుతున్నాడని, త్వరలోనే ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని సమాచారం.
సామజవరగమన రచయిత భాను భోగవరపు ఓ స్క్రిప్ట్ తో రవితేజను ఆకట్టుకున్నాడు. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవుతోందని, త్వరలోనే రవితేజ ఈ సినిమాపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలవుతుంది. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత నిర్మాణ సంస్థకు సంబంధించిన వివరాలను ఖరారు తెలియజేయనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా రవితేజ కొత్త డైరెక్టర్లతో పనిచేస్తూ విభిన్న సినిమాలు తీస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో విఫలమవుతున్నాయి. అయితే ఇవేమీ పట్టించుకోకుండా మాస్ మహారాజా కొత్తవారికి అవకాశం కల్పిస్తూ తాను దర్శకుల హీరో అని నిరూపించుకుంటున్నాడు.