మరోసారి తండ్రైన హీరో కార్తి

తమిళ నటుడు కార్తి మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య రంజనీ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని కార్తి తన సోషల్ మీడియాలో వెల్లడించారు

మరోసారి తండ్రైన హీరో కార్తి

Edited By:

Updated on: Oct 21, 2020 | 8:41 AM

Karthi blessed with Boy: తమిళ నటుడు కార్తి మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య రంజనీ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని కార్తి తన సోషల్ మీడియాలో వెల్లడించారు. మాకు మగబిడ్డ పుట్టాడు. మా ఈ ప్రయాణంలో అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు థ్యాంక్స్ చెప్పడం ఎంత మాత్రం సరిపోదు. మా బుడ్డోడికి మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్యు గాడ్ అని కామెంట్ పెట్టారు. ఇక కార్తి ట్వీట్‌కి సూర్య కూడా స్పందించారు. డాక్టర్ నిర్మలా శంకర్, ఆమె టీమ్‌కి మరోసారి థ్యాంక్స్ అంటూ కామెంట్ పెట్టారు.

కాగా 2011లో కార్తి, రంజనీ వివాహం చేసుకున్నారు. 2013లో వీరికి ఓ ఆడపిల్ల జన్మించింది. ఆమెకు ఉమయాళ్ అని పేరు పెట్టారు. ఇక కార్తి చెప్పిన గుడ్‌న్యూస్‌పై అభిమానులు స్పందిస్తున్నారు. అందరూ కార్తికి తమ అభినందనలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల సుల్తాన్ మూవీ షూటింగ్‌ని కార్తి పూర్తి చేసుకున్నారు. ఇందులో కార్తి సరసన రష్మిక నటించగా.. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More:

Bigg Boss 4: సొహైల్‌కి హారిక పంటిగాట్లు

Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. ప్రతాపం చూపిన అరియానా, హారిక