కరోనా అని తెలిసిన వెంటనే ఆందోళనకు గురయ్యా: నాగబాబు

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనాపై యుద్ధం చేస్తోంది. చిన్నా-పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వైరస్ సోకుతోంది.

కరోనా అని తెలిసిన వెంటనే ఆందోళనకు గురయ్యా: నాగబాబు

Updated on: Oct 28, 2020 | 12:22 PM

Naga Babu Corona: ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనాపై యుద్ధం చేస్తోంది. చిన్నా-పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ వైరస్ సోకుతోంది. అయితే అందులో చాలా మంది కరోనాను జయించడం కాస్త ఊరటను కలిగిస్తోంది. కాగా కరోనా సోకి కోలుకున్న వారిలో టాలీవుడ్‌ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. సెప్టెంబర్‌లో ఆయనకు కరోనా సోకగా.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనా నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నారు. (విక్రమ్ ‘కోబ్రా’: ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్‌లుక్‌ విడుదల.. అదిరిపోయాడుగా)

కాగా కరోనా సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఆయన ఓ జాతీయ దినపత్రికకు వివరించారు. ”కరోనా పాజిటివ్‌ అని తెలిసిన తరువాత చాలా ఆందోళనకు గురయ్యా. నాకు గతంలో అస్తమా ఉండటంతో వైరస్ సోకిన తొలి రోజుల్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. వాసన శక్తిని కూడా నేను కోల్పోయా. నా తరువాత నా భార్య పద్మజకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే తను ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుందని” ఆయన వెల్లడించారు. కాగా నాగబాబు కుమార్తె నిహారిక వివాహం డిసెంబర్‌లో ఉండగా.. ప్రస్తుతం కుటుంబం ఆ పనుల్లో బిజీగా ఉంది.(మరోసారి లెక్చరర్‌గా వెంకటేష్‌.!)

Loading...
Unable to load recommendations.
Follow Us