Tollywood: ఒకప్పుడు HYDలో సైట్ ఇంజినీర్.. ఇప్పుడు టాలీవుడ్‌ సంచలనం.. వివాదాలు ఎక్కువే.. ఎవరో గుర్తు పట్టారా?

  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది కెరీర్ ప్రారంభంలో రకరకాల ఉద్యోగాలు, పనులు చేసిన వారే. ఈ టాలీవుడ్ సంచలనం కూడా బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో సైట్ ఇంజినీర్ గా పనిచేశాడు.

Tollywood: ఒకప్పుడు HYDలో సైట్ ఇంజినీర్.. ఇప్పుడు టాలీవుడ్‌ సంచలనం.. వివాదాలు ఎక్కువే.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Director

Updated on: Nov 13, 2025 | 8:06 PM

పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడతను టాలీవుడ్ లో సంచలనం. అలాగనీ స్టార్ హీరో ఏమీ కాదు. అయితే అంతకు మించిన ఫాలోయింగ్, క్రేజ్ అతని సొంతం. తెలుగు, హిందీ భాషల్లో సుమారు 50కు పైగా సినిమాలు చేశాడు. తన ట్యాలెంట్ తో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1962లో తూర్పుగోదారి జిల్లాలో పుట్టాడీ టాలీవుడ్ సెన్సేషన్. సికింద్రాబాదులోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆతర్వాత విజయవాడనగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు. అయితే అతనికి చదువుకన్నా సినిమాల మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేది. ఇంజినీరింగ్ క్లాసులు ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసేవాడు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి చర్చించేవాడు. ఎలాగోలా ఇంజినీరింగ్ పట్టా పొందిన తర్వాత హైదరాబాద్ వచ్చాడు. కొన్ని రోజుల పాటు సైట్ ఇంజినీర్ గా పనిచేశాడు. అదే క్రమంలో ఓ వీడియో కేఫ్ ఓపెన్ చేశాడు. తద్వారా సినిమా వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు. అలా నాగేశ్వరావు సినిమా రావుగారిల్లు తో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఇదే క్రమంలో నాగార్జునను కలిసి ఒక సినిమా కథను చెప్పాడు. అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడు. కట్ చేస్తే.. ‘శివ’ రూపంలో ఇండస్ట్రీ హిట్. యస్.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

కెరీర్ ప్రారంభంలో పెద్ద హీరోలతో బ్లాక్ బస్టర్లు తీశాడు రామ్ గోపాల్ వర్మ. దేశం గర్వించదగ్గ డైరెక్టర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడీ డైరెక్టర్ ప్రతిభ పూర్తిగా మసకబారింది. గతంలోలా సినిమాలు చేయలేకపోతున్నాడు. అయితే ఇప్పుడీ సెన్సేషనల్ డైరెక్టర్ పేరు మరో సారి ట్రెండింగ్ అవుతోంది. దానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన మొదటి సినిమా శివ మళ్లీ థియేటర్లలోకి రానుంది. నవంబర్ 14 న ఈ కల్ట్ క్లాసిక్ మూవీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

శివ రీ రిలీజ్ ప్రమోషన్లలో రామ్ గోపాల్ వర్మ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.