
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎంతోమంది సెలబ్రిటీల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని ఫోటోలు మాత్రం చూడగానే నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, “ఈమె ఎవరా?” అని ఆలోచించేలా చేస్తాయి. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ అందమైన ఫోటో కూడా సరిగ్గా అలాంటిదే. అందాల లెహాంగాలో మెరిసిపోతూ అతిలోక సుందరిలా కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ? తన ముఖాన్ని సగం దాచేస్తూ, మెరిసిపోయే వెండి రంగు లేహంగాలో ఎంతో రాయల్ అండ్ గ్లామరస్ లుక్‌లో దర్శనమిస్తోంది ఈ సుందరి. ఆమె శరీరాకృతి, స్టైలిష్ పోజ్ మరియు రాయల్ జ్యువెలరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి ఈ అందాల భామ ఎవరో మీరు గుర్తుపట్టారా? భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్’ హిందీ సీజన్ 8 లో కంటెస్టెంట్‌గా పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రసిద్ధ హిందీ సాంగ్ ‘డీజె వాలే బాబు’ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకుని, ఆ తర్వాత విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచిన ప్రముఖ నటి. ఆమె మరెవరో కాదు.. నటాషా స్టాంకోవిచ్.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ తన పుట్టినరోజు సందర్భంగా ముంబైలో అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ‘నీతా ముకేష్ అంబానీ అనంత ఆశ్రయం’ ప్రాజెక్టును ఆమె అధికారికంగా ప్రారంభించారు. సమాజంలో ఆదరణ కరువైన అనాథ పిల్లలు, వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం ఈ సంచలన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ముంబైలోని గ్రాండ్ హయాత్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖులు, మోడల్స్ , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇదే వేదికపై జరిగిన ఫ్యాషన్ వీక్ ఈవెంట్స్‌లో పలువురు తారలు సందడి చేయగా, నీతా అంబానీ చేపట్టిన ఈ బృహత్తర సామాజిక సేవ కార్యక్రమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశమైంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
ఈ కార్యక్రమంలో నీతా అంబానీ తన కుమార్తె ఈషా అంబానీతో కలిసి సాంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. ఒకవైపు ముంబై ఫ్యాషన్ వీక్ గ్లామర్ హడావిడి నడుమ, మరోవైపు సామాజిక బాధ్యతను చాటుతూ నీతా అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన ఈ అద్భుతమైన సంకల్పం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ వేడుకలో ర్యాంప్ వాక్ చేసిన నటాషా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..