Pushpa2: జపాన్ అభిమానులకు పుష్ప2 గుడ్ న్యూస్.. సినిమా రిలీజ్ పై బిగ్ అప్డేట్

ఈ ఏడాది విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రాల్లో పుష్ప: ది రూల్ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పగా తన పవర్ ప్యాక్డ్ నటనకు గాను నేషనల్ అవార్డ్ అందుకోవడంతో ఈ క్రేజీ సీక్వెల్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ కోసం టోక్యోలో ఉంది.

Pushpa2: జపాన్ అభిమానులకు పుష్ప2 గుడ్ న్యూస్.. సినిమా రిలీజ్ పై బిగ్ అప్డేట్
Pushpa 2
Follow us
Balu Jajala

|

Updated on: Mar 03, 2024 | 8:46 PM

ఈ ఏడాది విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రాల్లో పుష్ప: ది రూల్ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పగా తన పవర్ ప్యాక్డ్ నటనకు గాను నేషనల్ అవార్డ్ అందుకోవడంతో ఈ క్రేజీ సీక్వెల్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ కోసం టోక్యోలో ఉంది. ఓ బాలీవుడ్ మీడియా తో మాట్లాడుతూ పుష్ప 2 జపనీస్ రిలీజ్ గురించి ఓ మేజర్ అప్ డేట్ ఇచ్చింది. ”జపాన్ అభిమానులకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వాస్తవానికి పుష్ప 2 ఒరిజినల్ వెర్షన్ రిలీజైన రోజే జపాన్ లో విడుదల చేసే అవకాశం ఉంది. (ఆగస్టు 15, 2024). ఆ సంభాషణలు జరుపుతున్నాం. అది భారీగా ఉండబోతోంది” అన్నారు.

పుష్ప 2 టీం షూటింగ్ సగంలో ఉందని, ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఓ పాటను చిత్రీకరిస్తానని రష్మిక వెల్లడించింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. అయితే పుష్ప మూవీ ఇండియాలోనే కాదు.. జపాన్ లోనూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. అక్కడి ప్రేక్షకులు ఈ మూవీ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తుండటంతో మేకర్స్ తెలుగుతో పాటు జపాన్ భాషలో ఒకేరోజు విడుదల చేసే అవకాశాలున్నాయి.

యానిమల్ సక్సెస్ మూవీతో నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలు చేస్తూ తన హవాను కొనసాగిస్తోంది. అయితే జపాన్ లో మీడియాతో ముచ్చటించిన రష్మిక తన కెరీర్ గురించి అనేక విషయాలను రివీల్ చేసింది. తాను త్వరలోనే మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి నటించబోతున్నట్లు రష్మిక వెల్లడించడం ఈ ఈవెంట్ ప్రత్యేకత. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన రష్మిక, విజయ్ హిట్ పెయిర్.

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు