AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరో చిరంజీవి.. కానీ నాకే 40 సీన్స్ పెట్టారు.. 515 రోజులు ఆడిన సినిమా అది.. టాలీవుడ్ నటుడు..

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు జనాల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు చిరు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఓ సీనియర్ నటుడు చిరు సినిమాలతో తనకున్న అనుబంధం గురించి.. ఆసక్తి విషయాలు పంచుకున్నారు.

Tollywood : హీరో చిరంజీవి.. కానీ నాకే 40 సీన్స్ పెట్టారు.. 515 రోజులు ఆడిన సినిమా అది.. టాలీవుడ్ నటుడు..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2026 | 10:40 AM

Share

తెలుగు చిత్రసీమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో ఆయన పోషించిన ప్రతినాయక (విలన్) పాత్ర టాలీవుడ్ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఈ సినిమా గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో గొల్లపూడి వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు విశేషంగా నిలిచాయి. గొల్లపూడి మారుతిరావు తన విలక్షణమైన నటన, రచనా శైలితో తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి సినిమాల ప్రస్తావనతో పాటు, ఆయన వ్యక్తిగత విలువలకు, తెరపై పోషించిన విలన్ పాత్రలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని గురించి ఒక ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మారుతిరావు తన రచనలలో సంప్రదాయాలు, మంచి-చెడు, మధ్యతరగతి జీవితాలు, స్త్రీలను గౌరవించడం వంటి అంశాలపై లోతైన అవగాహనను వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

సినిమా ప్రారంభ సమయంలో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ అనే టైటిల్ చూసి అందరూ చిరంజీవిదే ఆ పాత్ర అనుకున్నారని, కానీ ఆ విలన్ పాత్రను తనే పోషించానని గొల్లపూడి వెల్లడించారు. నాటక రంగంలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ, సినీ తెరపై ఈ పాత్ర చేసే ముందు తనకు ఎన్నో సందేహాలు ఉన్నాయని చెప్పారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించి ఏకంగా 515 రోజులు ప్రదర్శితమైంది. సినిమా ఇంటర్వెల్ సమయానికే తాను స్టార్‌గా మారిపోయానని ఆయన గుర్తు చేసుకున్నారు. ద్వితియార్థంలో కోడి రామకృష్ణ, కె. రాఘవేంద్రరావు వంటి ప్రముఖ దర్శకులు కూడా తన నటనను చూసి ఎంతో ప్రేరణ పొందారని పేర్కొన్నారు. గొల్లపూడి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభించినప్పటికీ, ఆయన తల్లి, భార్య మాత్రం ఈ విలన్ పాత్రను అస్సలు జీర్ణించుకోలేకపోయారు. “అందరూ నిన్ను తిడుతున్నారు, చిరంజీవి చేసిన మంచి పాత్ర చేయవచ్చు కదా” అని ఆయన తల్లి అన్నారట. కాలక్రమేణా గొల్లపూడి నటించిన సినిమాల సంఖ్య తగ్గడానికి ఆయన కుమారుడి అకాల మరణమే ప్రధాన కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిగత విషాదం వల్ల ప్రేక్షకుల మనస్సులో “కొడుకుని పోగొట్టుకున్న తండ్రి” అనే ఇమేజ్ బలంగా ముద్రపడిపోయిందని, దాంతో ఆయన ప్రత్యేకమైన ‘అన్‌యుజువల్ నటుడి’ ఇమేజ్ దెబ్బతిని అవకాశాలు తగ్గాయని ఆయన వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

మారుతిరావు మొదట తాను ఆ సమయంలో దాని గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు. అయితే, భారతీయ సినిమాలో అంతకుముందు లేని ఒక చెడు పాత్రను తాను ఇంప్రొవైజ్ చేసి, సృష్టించానని గర్వంగా ప్రకటించారు. ఇది ఆయన నటనా జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచిందని, కెమెరా ముందు ఈ విషయాన్ని చెప్పడానికి తాను గర్వపడుతున్నానని తెలిపారు. ఈ సంభాషణ మారుతిరావు బహుముఖ ప్రజ్ఞను, ఒక నటుడిగా పాత్రలో లీనమయ్యే తీరును, రచయితగా తన నైతికతను ప్రతిబింబిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

గొల్లపూడి మారుతిరావు..

Gollapudi Maruthi Rao

Gollapudi Maruthi Rao

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

Follow Us