Dear OTT: భార్యకు గురక సమస్య ఉంటే! అప్పుడే ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

గుడ్ నైట్ లో భర్తకు గురక సమస్య ఉంటే డియర్ లో భార్యకు ఈ సమస్య ఉంటుంది. జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదలైంది.

Dear OTT: భార్యకు గురక సమస్య ఉంటే! అప్పుడే ఓటీటీలోకి 'డియర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Dear Movie
Follow us

|

Updated on: Apr 26, 2024 | 9:11 PM

గురక సమస్యను సబ్జెక్టుగా ఎంచుకుని గతేడాది వచ్చిన చిత్రం గుడ్ నైట్. గురక వల్ల కొత్తగా పెళ్లయిన దంపతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాన్నిఎంతో ఎంటర్ టైనింగ్ గా, ఎమోషనల్ గా చూపించారు. ఓటీటీలోకి తెలుగు వెర్షన్ రాగా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన మరో సినిమా డియర్. గుడ్ నైట్ లో భర్తకు గురక సమస్య ఉంటే డియర్ లో భార్యకు ఈ సమస్య ఉంటుంది. జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదలైంది. అయితే సేమ్ టు సేమ్ గుడ్ నైట్ కథతోనే తీయడం, ఫన్, ఎంటర్ టైన్మెంట్ మిస్ అవడంతో డియర్ పెద్దగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది. పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. థియేటర్లలో ఆడియెన్స్ ను నిరాశ పర్చిన డియర్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28 అంటే ఈ ఆదివారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. థియేటర్లలో సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో కేవలం 16 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

ఆనంద్‌ రవించంద్రన్‌ తెరకెక్కించిన డియర్ సినిమాలో ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేని.ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు సంగీత సారథ్య బాధ్యతలు కూడా తీసుకున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. న్యూస్ రీడర్‌ అవ్వాలనుకుంటాడు అర్జున్ (జీవీ ప్రకాశ్). చిన్న శబ్దాలకు కూడా నిద్రలో నుంచి లేచిపోయే సమస్య అర్జున్ కు ఉంటుంది. మరోవైపు గురక సమస్యతో బాధపడుతూ ఉంటుంది దీపిక (ఐశ్వర్యా రాజేశ్). ఒకరి సమస్యలు మరొకరికి తెలియకుండా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఏమైందన్నదే డియర్ సినిమా కథ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles