ఆ గులాబీకైన తగునా ఈమె వంటి చిరునవ్వు..
TV9 Telugu
07 May 2024
4 ఫిబ్రవరి 1994న కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ మలయాళీ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రెబ మోనికా జాన్.
ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు జాన్, ఈమె తల్లి పేరు మినీ జాన్. ఈ బ్యూటీ కుటుంబం క్రైస్తవ మతానికి చెందినవారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో సేక్రేడ్ హార్ట్ గర్ల్స్ హై స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ భామ.
బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందింది ఈ అందాల తార రెబ.
2022లో క్రైస్తవ సంప్రదాయంలో కుటుంబీకులు, బంధుమిత్రుల మధ్య జోమోన్ జోసెఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
ఈ వయ్యారి సినిమాలకు ముందు కొన్ని ప్రకటనలలో కనిపించింది. అందులో ధాత్రి హెయిర్ ఆయిల్ ప్రకటన చాల ప్రముఖమైనది.
2016లో జాకోబింటే స్వర్గరాజ్యం అనే మలయాళీ ఫ్యామిలీ డ్రామాతో సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత మలయాళీ, తమిళ చిత్రాల్లో కనిపించింది.
2023లో శ్రీవిష్ణుకి జోడిగా కామెడీ డ్రామా చిత్రం సామజవరగమన చిత్రంతో తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది రెబ జాన్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి