‘ఆచార్య’లో నలుగురు హీరోయిన్లు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఆచార్యలో నలుగురు హీరోయిన్లు..!

Edited By:

Updated on: Jul 16, 2020 | 8:56 AM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సామాజిక కథాంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు భాగం కాబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. అలాగే చెర్రీ సరసన కీర్తి గానీ కియారా గానీ నటించే అవకాశాలు ఉన్నాయి. వీరితో పాటు ఆచార్యలో ఓ పాటలో రెజీనా కనిపించనుంది. ఆమె షూటింగ్‌ కూడా పూర్తి అయ్యింది. ఇక మరో పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా మెరవనుందని తెలుస్తోంది. చిరు నటించిన సైరాలో కీలక పాత్రలో నటించిన తమన్నా.. ఈ సినిమాలోనూ కెమెరా అప్పియరెన్స్ ఇవ్వనుందని సమాచారం. ఇలా చూస్తే మొత్తం నలుగురు స్టార్ హీరోయిన్లు ఆచార్యలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆచార్యకు మరింత గ్లామర్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనుండగా.. ఆచార్యపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.