‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ మూవీ రివ్యూ!

|

Jun 21, 2019 | 3:54 PM

టైటిల్ : ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ తారాగణం : చేతన్ మద్దినేని, కౌశిక్ ఓరా, నరేష్, పోసాని కృష్ణమురళి తదితరులు సంగీతం : కిరణ్ రవీంద్రనాధ్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : నరేష్ కుమార్ విడుదల తేదీ: 21-06-2019 చేతన్ మద్దినేని, కౌశిక్ ఓరా ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు నరేష్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మంజునాధ్. వి. కందుకూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల […]

ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ రివ్యూ!
Follow us on

టైటిల్ : ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’

తారాగణం : చేతన్ మద్దినేని, కౌశిక్ ఓరా, నరేష్, పోసాని కృష్ణమురళి తదితరులు

సంగీతం : కిరణ్ రవీంద్రనాధ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : నరేష్ కుమార్

విడుదల తేదీ: 21-06-2019

చేతన్ మద్దినేని, కౌశిక్ ఓరా ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు నరేష్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మంజునాధ్. వి. కందుకూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలిగిందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ‌ :

రాజు(చేతన్ మద్దినేని) చిన్నప్పటి నుంచి చదువులు తప్ప వేరే ధ్యాస లేకుండా పెరుగుతాడు. దీనితో కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అతని డ్రీంను కూడా నెరవేర్చుకోలేకపోతాడు. ఆ తర్వాత జరిగే కొన్ని సంఘటనల వల్ల రాజును పూర్తిగా మార్చడానికి కంకణం కట్టుకుంటాడు రాజు తండ్రి(నరేష్). ఇంతకీ రాజు తండ్రి ఎందుకు రాజును మార్చాలని అనుకున్నాడు.? రాజు చిన్నప్పటి నుంచి అలా పెరగడానికి ఎవరు కారణమయ్యారు.? రాజు తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి.? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు :

దర్శకుడు తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. హీరోగా నటించిన చేతన్.. తన పాత్రలో ఒదిగి మరీ నటించాడనే చెప్పాలి. పలు కీలక సన్నివేశాలు, ప్రీ- క్లైమాక్స్‌లో అతని నటన అద్భుతంగా ఉంటుంది. ఇక హీరోయిన్ కౌశిక్ ఓరా.. అటు గ్లామర్ పరంగా.. ఇటు నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోకి తండ్రిగా చేసిన నరేష్, కమెడియన్ వెన్నెల కిషోర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు .

విశ్లేష‌ణ‌ :

‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమాలో కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దాన్ని స్క్రీన్ మీద ఎలివేట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. ఇకపోతే కొన్ని అక్కర్లేని కామెడీ సన్నివేశాలు, సాగదీతీత సీన్స్ సినిమాకు మైనస్ పాయింట్లుగా నిలిచాయి. .

సాంకేతిక విభాగాల పనితీరు:

దర్శకుడు నరేష్ కుమార్ విద్యా వ్యవస్థపై తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. అయితే అది చూపించడంలో కొంచెం ఇబ్బంది పడ్డాడు. సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ లో మాత్రం నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

హీరో పెర్ఫార్మన్స్

స్టోరీ పాయింట్

మైనస్‌ పాయింట్స్‌ :

కొన్ని కామెడీ సీన్స్, సాగదీతీత సన్నివేశాలు