Karthikadeepam Vantalakka:: కార్తీక దీపం సీరియల్ అంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అంతలా ఫేమస్ అయింది ఈ సీరియల్. బుల్లితెరపై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. టీఆర్పీ రేటింగ్‌లో ఏకంగా ప్రపంచ క్రికెట్‌తో పోటీ పడి నిలిచింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ సిరియల్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మహిళా మణుల ఆదరాభిమానాలతో విజయవంతంగా దూసుకెళుతుంది. రోజురోజుకూ ఉత్కంఠను పెంచుతూ అందరి మన్ననలను పొందుతుంది.
ఈ సీరియల్ అంత పెద్ద హిట్ కావడానికి వంటలక్కే కారణం. ఆమె గురించి తెలియని వాళ్లుండరు. అయితే వంటలక్క క్యారెక్టర్ చేస్తున్న దీప ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈమె నటనకు ఆకర్షితులైన అభిమానులు మహానటి సావిత్రితో పోలుస్తున్నారు. దీంతో స్పందించిన దీప ఆమె నటనలో కొంచెం చేసినా నా జన్మ ధన్యమంటోంది.